నాణ్యమైన ఎరువులు, విత్తనాలనే విక్రయించాలి


Mon,May 20, 2019 11:27 PM

వట్‌పల్లి: ఫర్టిలైజర్‌ దుకాణాల్లో నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే విక్రయించాలని వట్‌పల్లి ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, ఏవో మహేశ్‌చౌహన్‌ సూచించారు. అదే విధంగా ఎరువుల దుకాణాల డీలర్లు దుకాణాల్లో ఎరువుల నిలువ, ధరల పట్టికను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో వారు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి దుకాణంలో ఎరువులు, విత్తనాల విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. ఫర్టిలైజర్‌ దుకాణాల్లో రైతులకు విక్రయించే ఎరువులకు రసీదులు తప్పని సరిగా అందజేయాలని..రైతులు ఎట్టి పరిస్థితిలో రసీదులు లేకుండ ఎరువులు కొనకూడదని చెప్పారు. రసీదుల్లో రాసిన ధరలే దుకాణాల్లోన్ని ధరల పట్టికలో ఉండాలని స్పష్టం చేశారు. దుకాణాదారులను అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే తమ దృష్టికి తేవాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు. రైతులు ఇష్టా రాజ్యంగా ఎరువులు వాడకూడదని వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారమే తక్కువ మోతాదులో ఎరువులు వాడుతూ వ్యవసాయం చేయాలన్నారు. భారీగా ప్రకటనలు చేసే ఎరువులు, విత్తనాల కంపెనీల పట్ల జాగ్రతగా ఉండాలన్నారు. వానకాలం సీజన్‌ ప్రారంభమైన తర్వాత అన్ని గ్రామాల్లో వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారని పంటలు సాగు చేసే ముందు వారి సూచనలు తీసుకోవాలన్నారు. అనంతరం దుకాణాలోన్ని ఎరువుల విక్రయాల రికార్డులను పరిశీలించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
రాయికోడ్‌: ఎరువుల దుకాణాల్లో నకిలీ విత్తనాలను విక్రయించ వద్దని మండల వ్యవసాయాధికారి అవినాశ్‌వర్మ, ఎస్‌ఐ గోపిలు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో వారు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో అవినాశ్‌వర్మ, ఎస్‌ఐ గోపి మాట్లాడుతూ... నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎరువులు, విత్తనాలను విక్రయించాలని సూచించారు. దుకాణంలో ఉండే ఎరువులు, విత్తనాల ధరలు, నిల్వ వివరాలను బోర్డుపై రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం దుకాణాల్లోని రికార్డులను వారు పరిశీలించారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...