విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి


Mon,May 20, 2019 03:35 AM

మేడ్చల్, నమస్తే తెలంగాణ: విద్యార్థి దశలో వ్యసనాలకు గురి కాకుండా విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని జైళ్ల శాఖ సంగారెడ్డి డీస్పీ శివకుమార్ గౌడ్ అన్నారు. మేడ్చల్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అబ్దుల్ కలాం ఉచిత కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక పోకడలతో విదేశీ వ్యామోహం బారిన పడి చిన్నతనంలోనే అనేక మంది చెడు అలవాట్ల బారిన పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిసై నేరాలు చేసి జైలు పాలవుతున్నారని అన్నారు. అలా కాకుండా ఉండడానికి ఉపాధ్యాయులు చెప్పిన మాటలు విని ప్రయోజకులుగా ఎదుగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను పొంది ముందుకు సాగాలని చెప్పారు. అమ్మాయిలు ఫోన్‌లు, టీవీ సీరియల్‌కు అతుక్కుపోకుండా చదువుపై శ్రద్ధ కనబర్చాలన్నారు. ఆపద సమయంలో యువతులు తప్పించుకునే విధంగా సంరక్షణ మెళకువలను నేర్పించాలని సూచించారు. అనంతరం సెంటర్ కో ఆర్డినేటర్ మాట్లాడుతూ ఈ సెంటర్ సెలవు దినాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఉచితంగా పలు అంశాలపై వారి భవిష్యత్‌కు కౌన్సెలింగ్ అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మనోహర్, రామదూత, శాస్త్రవేత్త అజయ్‌కుమార్, సెంటర్ నిర్వహణ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విద్యార్థులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...