ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయండి


Mon,May 20, 2019 03:35 AM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : జహీరాబాద్ డివిజన్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ఎంపీడీవో రాములు స్ట్రాంగ్ రూంను పరిశీలించి, ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పరిశీలించారు. ఆదివారం జహీరాబాద్ మండలంలోని రంజోల్ బాలికల గురుకుల పాఠశాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం గదులను పరిశీలించారు. జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, కోహీర్, రాయికోడ్ మండల ఓట్ల లెక్కింపు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మండలానికి ఒక ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీల వారీగా ఓట్ల లెక్కింపు కోసం అధికారులు గదులో ఏర్పాట్లు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూం పక్కన ఉన్న గదుల్లోనే ఓట్లను లెక్కించేందుకు అధికారులు గదులు పరిశీలించి, ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశంలో న్యాల్‌కల్, కోహీర్ ఎంపీడీవోలు రాజశేఖర్, వెంకట్‌రెడ్డితో పాటు పీఆర్ ఏఈ కోటేశ్వర్‌రావులు ఉన్నారు.

ఏజెంట్ల కోసం పాస్‌లు సిద్ధం...
ఝరాసంగం : ఓట్ల లెక్కింపునకు వెళ్లే అభ్యర్థులకు ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పా ట్లు చేస్తున్నట్లు ఎంపీడీవో మారుతి విఠోభ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన రంజోల్‌లోని గురుకల పాఠశాలలో ఎంపీటీసీతో పా టు జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. లెక్కింపునకు వెళ్లే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు గాని, లేదా వారి తరఫున వెళ్లేవారి కోసం పాస్‌లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ముందుస్తుగా అభ్యర్థులకు నోటీస్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...