సిద్ధంగా 1,10,744 భూసార పరీక్ష కార్డులు


Sat,May 18, 2019 11:19 PM

సంగారెడ్డి చౌరస్తా: జిల్లాలో 2018-19 సంవత్సరానికి సంబంధించి 1,10,744 భూసార పరీక్ష కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పలువురు రైతులకు ‘సాయిలు హెల్త్‌కార్డు’లను అందించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా రైతులకు కార్డులను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 18,943 గ్రిడ్స్‌లో మట్టిని పరీక్షించడం జరిగిందన్నారు. వర్షాధారం కింద 25ఎకరాలకు ఒక నమూనాను, నీటిపారుదల కింద 10 ఎకరాలకు ఒక నమూనాను సేకరిస్తారని తెలిపారు. విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వాడకంతో భూసారం తగ్గిపోతుందని, భూసార పరీక్షలు చేయించుకోవడంతో భూమిలో గల వివిధ పోషక పదార్థాల లభ్యత తెలుస్తుందన్నారు. భూసార పరీక్ష ఆధారంగా అవసరమైన ఎరువులు మాత్రమే వాడి భూసారం తగ్గకుండా కాపాడుకోవచ్చని, చీడపీడల బెడదను నివారించడంతో పాటు ఖర్చు తగ్గించుకుని ఆరోగ్యవంతమైన పంటలు పండించవచ్చని పేర్కొన్నారు. భూసార పరీక్షలతో చేకూరే లాభాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని, పరీక్షలు చేయించి ఆ భూమిలో పండే అనువైన పంటలను వేసుకుని అధిక దిగుబడులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు, వ్యవసాయశాఖ అధికారులు, ఏఈవోలు, ఇరిగిపల్లి, తాళ్లపల్లి గ్రామ రైతులు నీరజ, సుభాశ్‌రెడ్డి, ప్రవీణ్‌, చంద్రయ్య పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...