అంగన్‌వాడీ కేంద్రాల పని బాగున్నది


Sat,May 18, 2019 11:18 PM

-కేరళ, తమిళనాడు బృందం సభ్యుల కితాబు
హత్నూర: తెలంగాణలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల పని తీరు చాలా బాగున్నదని కేరళ, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన ఉచిత పాఠశాల విద్య బృందం సభ్యులు కితాబునిచ్చారు. శనివారం మండలంలోని తాహెర్కాన్‌పేట, దౌలాపూర్‌ గ్రామాల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందిస్తున్న సేవలను గురించి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎదుగుదలకు అందజేస్తున్న పౌష్టికాహారం, బాలింతల ఆరోగ్య పరిస్థితులపై కల్పిస్తున్న అవగాహన, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర ఆంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పలు రకాల చార్ట్‌లను పరిశీలించి వాటి సారాంశాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లలకు అందిస్తున్న ఉచిత విద్య, ఆటపాటలతో కూడిన విద్యాబోధన, మానసికోల్లాసానికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. కాగా అంగన్‌వాడీ టీచర్లు పలు ఆంశాలపై వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రతినిధులు శ్రీనివాస్‌, కృష్ణతోపాటు అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...