ఆస్తులు ధ్వంసం చేసిన వ్యక్తుల అరెస్ట్‌


Sat,May 18, 2019 11:18 PM

హత్నూర: ఆస్తుల ధ్వంసం చేసిన వ్యక్తులను అరెస్ట్‌ చేసి కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు జిన్నారం సీఐ రవి తెలిపారు. శనివారం హత్నూర పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా సీఐ రవి మాట్లాడుతూ హత్నూర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగుల్‌దేవులపల్లి గ్రామానికి చెందిన నయిమ్‌ కొన్ని రోజులుగా ఇతరుల భూములను తక్కువ ధరకు అమ్మాలని ఒత్తిడి చేస్తూ కొనుగోలు చేస్తున్నాడని తెలిపారు. కాగా నాగుల్‌దేవులపల్లి గ్రామ శివారులోని తన సమీప బంధువైన మీనాజ్‌ మోహినోద్దీన్‌కు చెందిన భూమిని అమ్మాలని ఒత్తిడి చేయగా అతడు నిరాకరించాడు. దీంతో కొన్ని రోజుల క్రితం భూమి హద్దురాళ్లు , భూమి చుట్టూ వేసిన 185 రాళ్లులను విరగొట్టాడు. అదే విధంగా మరోసారి మీనాజ్‌మోహినోద్దీన్‌ మొబైల్‌ ఫోన్‌ లాక్కొని దాడి చేసి భయబ్రాంతులకు గురి చేశాడు. అప్పట్లో నయిమ్‌ పై పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కాగా ఈ నెల 16న రాత్రి నయిమ్‌తోపాటు సయ్యదొద్దీన్‌ ఇఫ్రాన్‌, పోచయ్య, రహమాన్‌, జావేద్‌ఖాన్‌, రమేశ్‌లు కలిసి మోహినోద్దీన్‌ భూమిలోకి వెళ్లారు. అక్కడ కాపలాగా ఉన్న వ్యక్తిని బెదిరించడంతోపాటు జేసీబీ సహాయంతో సుమారు 10వేల కోళ్లు పెంచేందుకు ఏర్పాటు చేసిన ఫౌల్ట్రీఫాంతో పాటు సిబ్బంది నివాస గృహాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు సీఐ వెల్లడించారు. అంతే కాకుండా పలుమార్లు భూ తగాదాల్లో నయిమ్‌పై కేసులు నమోదైనట్లు తెలిపారు. కాగా ఆస్తుల ధ్వంసం విషయంలో సుమారు రూ.50లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. బాధితుడు మీనాజ్‌ మోయినోద్దీన్‌ ఫిర్యాదు మేరకు పలు సేక్షన్ల కింద కేసు నమోదు చేసి నయిమ్‌తోపాటు మరో నలుగురిని అరెస్ట్‌ చేసి కోర్టుకు రిమాండ్‌కు తరలించామని, అందులో రహమాన్‌, జావేద్‌ఖాన్‌లు పరారీలో ఉన్నట్లు సీఐ వివరించారు. కాగా ఆస్తుల ధ్వంసం చేయడానికి ఉపయోగించిన జేసీబీని కూడా స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామని తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...