సాగుకు... సన్నద్దం


Sat,May 18, 2019 12:41 AM

-2,51,710 హెక్టార్లు అంచనా
-ఈనెలాఖరున రైతుబంధు పంపిణీ
- ఏర్పాట్లు పూర్తి చేసిన వ్యవసాయ శాఖ
-రెండు పంటలకు ఎకరానికి రూ.10వేలు
-50% సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం
సంగారెడ్డి టౌన్
వానకాలం సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 2019-20 వానకాలంలో 2,51,710 హెక్టార్లలో పంటలు సాగు చేసేందుకు అధికారులు మండలాల వారీగా ప్రణాళికలు రెడీ చేసి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి నివేదిక అందజేశారు. ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పెట్టుబడి సాయానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు 2018 మే నెల 10వ తేదీ నుంచి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎకరానికి రెండు పంటలకు గాను రూ.4వేల చొప్పున రెండు పంటలకు రూ.8వేల పెట్టుబడి సాయాన్ని అందించింది. ప్రస్తుతం వానకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.5వేల చొప్పున రెండు పంటలకు ఎకరానికి రూ.10వేలను అందివ్వాలని, ఆ దిశగా రైతుల వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించి వివరాలు సేకరించారు. పంటపెట్టుబడి సాయం అందించేందుకు మే నెలాఖరు నాటికి జిల్లాలోని రైతులందరికీ ఎకరాకు రూ.5వేల చొప్పున వానకాలం పంటకు అందిస్తారు. త్వరలో రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమకానున్నాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. గతంలో జిల్లాలో 2.71లక్షల మంది రైతులకు చెందిన 7.95లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందింది. ఈ సారి నూతనంగా గతంలో రైతు బంధు అందని రైతులకు కూడా రైతుబందు పథకం అందించనున్నారు.

జిల్లాలో అత్యధికంగా పత్తి పంటను రైతులు సాగుచేయనున్నారని అంచనా వేశారు. పత్తి పంట 1,19,120 హెక్టార్లు, రెండో స్థానంలో కందులు 25,865 హెక్టార్లు, చెరుకు 21,709 హెక్టార్లు, వరి 20,947 హెక్టార్లు, సోయాబీన్ 17,769 హెక్టార్లు, మొక్కజొన్న 15,564 హెక్టార్లు, పెసలు 14,408 హెక్టార్లు, మినుములు 10,234 హెక్టార్లు, జొన్న 4797 హెక్టార్లలో పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 2,51,710 హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవశాయ శాఖ అధికారులు వానకాలం ప్రణాళికలను రూపొందించి వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అందజేశారు.

వానకాలానికి ఎరువులు, విత్తనాలు సిద్ధం
2019-20 వానకాలంకు కావాలసిన విత్తనాలను అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు రూపొందించి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి నివేదిక అందజేశారు. ముఖ్యంగా సోయాబీన్, వరి, జొన్న, మొక్కజొన్న, కందులు, మినుములు, పెసలు వంటి వాటి అవసరం మేరకు సిద్ధం చేశారు. జిల్లాలో సోయాబీన్ జేఎస్ 335 రకం 13,000 క్వింటాళ్లు, వరి 7,700 క్వింటాళ్లు, అందులో ఎంటీయూ 1010 రకం 5100 క్వింటాళ్లు, కేఎన్‌ఎం-118 రకం 800 క్వింటాళ్లు, ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకం 850 క్వింటాళ్లు, బీపీటీ 5204 రకం 650 క్వింటాళ్లు, ఐజీఐ 18047 రకం 300 క్వింటాళ్లు, పొద్దు తిరుగుడు 4500 క్వింటాళ్లు, ధనియాలు 2400 క్వింటాళ్లు, కందులు ఐసీపీఎల్ రకం 155 క్వింటాళ్లు, ఎల్‌ఆర్‌జీ 41 రకం 110క్వింటాళ్లు, పెసలు 120 క్వింటాళ్లు, మినుములు 157 క్వింటాళ్లు విత్తనాలు సబ్సిడీపై రైతులకు అందజేయనున్నారు.
అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో 36,089 మెట్రిక్ టన్నుల యూరియా, 12,299 మెట్రిక్ టన్నుల డీఏపీ, ఎంఓపీ15,223 మెట్రిక్ టన్నులు, 28,235 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 7072 టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులు మొత్తం 98,919 ఎరువులు అవసరం ఉంటుందని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందస్తుగానే జిల్లాలో ఎరువుల అవసరం ఏ నెలలో ఎంత డిమాండ్ ఉంటుందో అని అంచనా వేసి అందుకు సరిపడా నిల్వలను ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ నెలలో అన్ని ఎరువులు 7440 మెట్రిక్ టన్నులు, మే నెలలో 10,822 మెట్రిక్ టన్నులు, జూన్ నెలలో 22,109 మెట్రిక్ టన్నులు, జులై నెలలో 22,310 మెట్రిక్ టన్నులు, ఆగస్టులో 23,416 మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్‌లో 12,822 మెట్రిక్ టన్నులు మొత్తం 98,919 మెట్రిక్ టన్నులను రైతులకు సరఫరా చేయనున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...