ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రమదానం


Sat,May 18, 2019 12:28 AM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న చెత్తను తొలిగించి, చెత్త రహిత కార్యాలయాలుగా చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు అధికారులు చెత్తను తొలిగించారు. శుక్రవారం జహీరాబాద్ తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు చెత్తను తొలిగించారు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ విస్తీర్ణ అధికారి సుమతి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది చెత్తను తొలిగించి పరిశుభ్రం చేశారు. కార్యాలయంతో పాటు ఆవరణలో ఉన్న చెత్తను తొలిగించారు. కార్యాలయంలో ఉన్న చెత్తను తొలిగించి, శుభ్రం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆర్‌ఐ నందకిశోర్‌ల ఆధ్వర్యంలో వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు చెత్తను తొలిగించారు. కార్యాలయం చుట్టూ చెత్తను తొలిగించి, కార్యాలయంలో రికార్డులు శుభ్రం చేశారు.

వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం చేయాలి...
బుర్థిపాడులో వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చే సేలా పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఈవోపీఆర్డీ సుమతి అన్నారు. శుక్రవారం గ్రామంలో నిర్మాణం చేస్తున్న మరుగుదొడ్లును పరిశీలించి, పలు సూచనలు చేశారు. వందశాతం మరుగుదొడ్లు ని ర్మాణం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మరుగుదొడ్లు నిర్మాణం చేసుకున్న వారికి వెంటనే బిల్లు లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, శేఖర్, ఉపాధి హామీ ఎఫ్‌ఏ విజయ్ తదితరులు ఉన్నారు.

తహసీల్దార్ ఆధ్వర్యంలో...
ఝరాసంగం : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాయ పరిసరాలలో శుక్రవారం తహసీల్దార్ అమీన్‌సింగ్, కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. తహసీల్దార్, ఎంపీడీవో అవరణలో వీఆర్వోలతో కలిసి చెత్తచెదారాన్ని తొలిగించారు. అనంతరం తహసీల్దార్ మా ట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత తో ఉంటే గ్రామాల్లో ప్రజలకు అంటు రోగాలు ప్రబలకుం డా ఉంటాయన్నారు. మన చుట్టూ పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, వీఆర్వోలు ఇస్మాయిల్, ఫక్రుద్దీన్, బిచ్చయ్య తదితరులు ఉన్నారు.

చెత్తచెదారం తొలిగింపు...
న్యాల్‌కల్ : మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం అధికారులు, సిబ్బంది శ్రమదానం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల పరిసరాల్లో అధికారులు, సిబ్బంది కలిసి పిచ్చి మొక్కలు, చెత్తచెదారాన్ని తొలిగించి శుభ్రం చేశారు. అలాగే మిర్జాపూర్(బీ) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్‌కుమార్, నాయబ్ తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో రాజశేఖర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, వైద్యాధికారులు ప్రశాంతి, ఫిరోజ్ ఖాతర్, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీపీ కార్యాలయంలో...
కోహీర్ : జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో పారిశుధ్య పనులను నిర్వహించారు. శుక్రవారం ఎంపీపీ కార్యాలయ పర్యవేక్షకుడు పాండయ్య ఆధ్వర్యంలో కార్యాలయావరణను శుభ్రం చేశారు. ఈ నెల 14వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించారు. దీంతో కార్యాలయావరణలో పలు రకాల కాగితాలతో చెత్త పేరుకుపోయింది. మొత్తానికి సిబ్బంది పారిశుధ్య పనులను నిర్వహించి మండల పరిషత్ కార్యాలయ ఆవరణను సుందరంగా తీర్చిదిద్దారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...