మహీంద్రా సీఐఈ పరిశ్రమలో ప్రమాదం


Sat,May 18, 2019 12:28 AM

-కార్మికుడు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
జహీరాబాద్, నమస్తే తెలంగాణ : మహీంద్రా సీఐఈ పరిశ్రమంలో గ్యాస్ సిలిండర్ పేలి ఐదు మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, ఒక కార్మికుడు మృతి చెందిన సంఘటన ఇది. పోలీసులు, కార్మికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ మండలంలోని బుచినెల్లి గ్రామ శివారులో ఉన్న మహీంద్రా సీఐఈ పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. శుక్రవారం రాత్రి 1.40 గంటల ప్రాంతంలో పరిశ్రమల్లో ప్రదీప్ (26), రజిత్‌కుమార్, కాశీనాథ్, రాములు, సిద్ధిలింగప్ప, ఆకాశ్‌లు పని చేస్తున్నారు. ప్రదీప్, రజిత్‌కుమార్, కాశీనాథ్, రాములు, సిద్ధిలింగప్పలు పరిశ్రమలో ఇంజినీరింగ్ అధికారులుగా పని చేస్తున్నారు. ఆకాశ్ కాంట్రాక్టర్ కార్మికుడిగా పని చేస్తున్నారు. పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ నింపుతుండగా ఒకే సారి పేలి ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంలో ప్రదీప్ (26) సంఘటనా స్థలంలో మృతి చెందాడు. తోటి కార్మికులు రజిత్‌కుమార్, కాశీనాథ్‌లకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానకు చికిత్స కోసం తరలించారు. రాములు, సిద్ధలింగప్ప, ఆకాశ్‌లకు సైతం స్వల్ప గాయలు కావడంతో వారి హైదరాబాద్‌లోని మరో దవాఖానకు తరలించారు.

నిర్లక్ష్యంతోనే పేలిన గ్యాస్ సిలిండర్...
గ్యాస్ సిలిండర్ నింపుతుండగా ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో గ్యాస్ లీక్ కావడంతో మంటలు వచ్చి ఈ ప్రమాదం జరిగిందని వారు పేర్కొంటున్నారు. యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు కర్ణాటకలోని బీదర్ జిల్లా బాల్కి నివాసి. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు అగ్ని మాపక కేంద్రంకు సమాచారం ఇవ్వడంతో భారీ నష్టం తగ్గిందన్నారు. గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం రావడంతో ఇతర కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఈ మేరకు చెరాగ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...