కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి


Sat,May 18, 2019 12:28 AM

-23న ఉ. 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
-ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలి
-కౌంటింగ్‌కు హాజరుకాకుంటే చర్యలు
-మెదక్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి
సంగారెడ్డి టౌన్: మెదక్ పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు వీవీప్యాట్లలోని ఓటరు స్లిప్పులను లెక్కించి ఎంపీ ఓట్లను ఏ విధంగా లెక్కించాలో అవగాహన కల్పించారు. మెదక్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపును నర్సాపూర్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహిస్తున్నామని వివరించారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, కౌంటింగ్ సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని సూచించారు. విధులకు హాజరుకాని సిబ్బందిపై ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ చేయడం జరుగుతుందని, కౌటింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం జరుగదని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సంగారెడ్డి ఆర్డీవో ఎస్.శ్రీను, సంగారెడ్డి తాసిల్దార్ పరమేశ్, కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...