కలెక్టరేట్ నుంచే షురూ..


Sat,May 18, 2019 12:26 AM

ప్రతి శుక్రవారం శ్రమదానం..
సంగారెడ్డి చౌరస్తా : రానున్నది వానకాలం కావడంతో ఈసారి హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు కలెక్టర్ హనుమంతరావు ఇప్పటి నుంచే ఆ దిశగా చర్యలు చేపట్టారు. నర్సరీలను తనిఖీ చేస్తున్న కలెక్టర్ అవసరమైన మేరకు మొక్కలను పెంచాలని ఇప్పటికే ఆదేశించారు. ఈలోగా గ్రామ స్థా యి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను హరితహారానికి సిద్ధం చేస్తున్నారు. కార్యాలయాల ప్రాంగణంలో మొక్కలు నాటే ముందు ఆ యా అన్ని కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కలెక్టర్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చు ట్టారు. ఇకపై ప్రతి శుక్రవారం శ్రమదానం నిర్వహించేందుకు నిర్ణయించారు. గ్రామం మొదలుకుని జిల్లా స్థాయి వరకు అన్ని కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, అందుకోసం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ప్రతి వారం నిర్వహించే శ్రమదానంలో భాగస్వాములు కావాలని ఆదేశించారు. అంతేకాదు నెల లో ఒకసారి శ్రమదానం పై జిల్లా స్థాయిలో వివరాలు తెలుసుకుని బాగా పని చేస్తున్న అధికారులు, పరిశుభ్రంగా నిలిచిన కార్యాలయాలకు ప్రశంసల జల్లు కురవనున్నది. అం దుకు వారికి ప్రోత్సాహకం కూడా అందించాలని కలెక్టర్ నిర్ణయించినట్టు తెలిసిందే. అదే సమయంలో శ్రమదానంలో పూర్తిగా వెనుకంజ లో నిలిచే ప్రభుత్వ కార్యాలయా లు, సంబంధిత అధికారుల కు చా ర్జిమెమోలు జారీ చేసేందుకు కూడా వెనుకాడబోనని కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు.

శ్రమదానం ఇలా...
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రతి శుక్రవారం శ్రమదానం నిర్వహిస్తారు. ఇందులో భాగం గా పరిశుభ్రంగా ఉన్న మూడు కార్యాలయాలను, అపరిశుభ్రంగా ఉన్న మూడు కార్యాలయాలను ప్రతి నెల ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక చేసే ప్రక్రియను కలెక్టర్ ఒక బృందానికి అప్పగించారు. ఆ బృందంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారితో పాటు మున్సిపల్ కమిషనర్ ఉంటారు. వీరంతా ఒక కమిటీగా ఏర్పాటై శ్ర మదానం చేసిన కార్యాలయాలను తనిఖీ చేస్తారు. ఈ క్రమంలో బాగా పని చేస్తున్న కార్యాలయాలకు ప్రశంసలు, పని చేయని కార్యాలయాలకు మెమోలు అందనున్నాయి.

పార చేతబట్టిన కలెక్టర్...
ఈ నేపథ్యంలో కలెక్టరేట్ నుంచే శ్రమదానం కార్యక్రమాన్ని కలెక్ట ర్ షురూ చేశారు. కలెక్టరేట్ ప్రాం గణంలో పేరుకుపోయిన చెత్తను ఊడ్చేశారు. కలెక్టర్ పారచేతబట్టి చెత్తను ఊడ్చారు. కలెక్టర్‌తో పా టు ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టరేట్‌తో పాటు పారిశుధ్య ప్రక్రియ లో భాగస్వాములయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గల ప్రభుత్వ కార్యాలయాలన్నింటి లో శుక్రవారం పెద్ద ఎత్తున శ్రమదానం నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం శ్రమదానం నిర్వహించి అధికారులు, సిబ్బంది అందరూ భాగస్వాములు కానున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 8 గంటలకు కలెక్టరేట్‌లోని అందరూ అధికారులు, సిబ్బంది కలెక్టర్‌తో కలి సి శ్రమదానంతో కలెక్టరేట్‌లోని పరిసరాలను శుభ్రం చేశారు. పారలు, గంపలు, చీపుర్లు, చేతపట్టుకుని బృందాలుగా ఏర్పాటై కలెక్టరేట్‌లోని ప్రధాన ముఖద్వారానికి ఎడమవైపుగల ప్రాంతాన్ని శుభ్రం చేసి పా రిశుధ్య సిబ్బంది సహకారంతో చెత్తను తరలించారు. జిల్లా ఎస్సీ కార్యాలయం, ఆర్డీవో, ఎంఆర్‌వో, వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ దవాఖాన తదితర కలెక్టరేట్‌లో లేని ఇతర కార్యాలయాలలో శ్రమదానం నిర్వహించారు. అదే విధంగా జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామస్థాయి కార్యాలయాలలో కూడా శ్రమదానం చేశారు.

శ్రమదానం నిరంతరం కొనసాగాలి...
జిల్లాలో శ్రమదానం కార్యక్రమం ఇక నుంచి ప్రతివా రం కొనసాగాలి. ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుతామో అదే విధంగా మనం పని చేస్తున్న కార్యాలయాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిపై ఉన్నది. ఏ పనైనా అందరి సహకారంతోనే విజయవంతం అవుతుంది. హరితహారంలో మొక్క లు పెంచాలంటే ముందుగా స్థలాన్ని గుర్తించాలి. చెత్త, చెదారం, ముళ్లతో నిండిన స్థలాల్లో మొక్కలు నాటడం కష్టమవుతుంది. అందుకే ముందుగా ఆయా ప్రభుత్వ కార్యాలయాలలో అందుబాటులో ఉన్న స్థలంలో పేరుకుపోయిన చెత్తను తొలిగించి పరిశుభ్రం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం శ్రమదానం చేయడంలో త్వరలో ప్రజలను కూ డా భాగస్వాములను చేసి వారి సహకారంతో పరిశుభ్రమైన సంగారెడ్డిని తయారు చేసుకుంటాం. కలెక్టరేట్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు మొక్కలు నాటేందుకు కలెక్టరేట్ పరిసరాలలో కొంత స్థలాన్ని కేటాయిస్తూ మొక్కలు నాటడం, వాటిని బతికించడం తదితర బాధ్యతలను వారికే అప్పగిస్తాం. శ్రమదానంలో, హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా.
- కలెక్టర్ హనుమంతరావు

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...