హిత ఆత్మహత్య

Thu,May 16, 2019 11:16 PM

సంగారెడ్డి రూరల్‌: భర్త, అత్తామామల వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం సాయంత్రం సంగారెడ్డి పట్టణపరిధిలో చోటు చేసుకున్నది. సీఐ వెంకటేశ్‌ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రాందేవ్‌గూడ ప్రాంతానికి చెందిన శిరీష (21)కి సంగారెడ్డి అస్తబల్‌ ప్రాంతానికి చెందిన సుమంత్‌తో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. అయితే సుమంత్‌ హైదరాబాద్‌ మాదాపుర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

పైండ్లెన తర్వాత శిరీష భర్త, అత్తమామలు అదనపు కట్నం తీసుకురావాలని వేధించసాగారు. శిరీష గైనిక్‌ సమస్యతో బాధపడుతుందని తెలిసి కూడా వారు పిల్లలు కావాలని ఒత్తిడి చేయడంతో వారి బాధలు తట్టుకోలేక ఆమె అత్తమామ లేనపుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఊరేసుని ఆత్మహత్య చేసుకున్నది. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నది. వెంటనే వారిపై కఠినచర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు సుమంత్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని సముదాయించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖాన తరలించి మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు మృతురాలు శిరీష బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...