వీఆర్వ్‌ సామెల్‌ సస్పెండ్‌


Thu,May 16, 2019 11:13 PM

జోగిపేట తాసిల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకున్న కలెక్టర్‌ హనుమంతరావుకు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. భూములకు సంబంధించిన సమస్యలను పట్టించుకోవడం లేదని వీఆర్వ్‌పై ఫిర్యాదు చేశారు. తాడ్మన్నూర్‌కు చెందిన కేరూరి దత్తాత్రి తాను భూమిని కొనుగోలు చేసి, తన పేరుకు మార్పుకోసం దరఖాస్తు చేసుకుని ఏడాది కావస్తున్నా వీఆర్వ్‌ సామెల్‌ పట్టించుకోవడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో ఆక్కడే ఉన్న వీఆర్వ్‌ను పిలిచి అడుగగా, నిజమేనని తెలుపడంతో వీఆర్వ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆదే విధంగా మండల పరిధిలోని సాయిబాన్‌పేట, డాకూర్‌, కిచ్చన్నపల్లి, కన్‌సాన్‌పల్లి, రాంసానిపల్లి, ఆక్సాన్‌పల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు వారి సమస్యలను కలెక్టర్‌ చెప్పడంతో, అక్కడే ఉన్న తాసిల్దార్‌ బాల్‌రెడ్డికి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై సస్పెన్షన్‌ వేటు
మండల పరిధిలోని కిచ్చన్నపల్లిలో ఏర్పాటు చేసిన నర్సరీని కలెక్టర్‌ హనుమంతరావు సందర్శించారు. నర్సరీలోని మొక్కల పెంపకం తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. మొక్కల ఎదుగుదల అంతగా కనిపించకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. నర్సరీలోని మొక్కలలో 20 శాతం మొక్కలు మాత్రమే ఎదుగుదల ఉండడంతో ఆయన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సునీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంలో ఇంత నిర్లక్ష్యం చేస్తారా, ఎందుకు ఇలా జరిగిదంటూ ఆమెను నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మొక్కల పెంపకంలో 10 రోజుల్లోగా పురోగతి లేకుంటే విధుల నుంచి తొలగించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...