24 గంటల్లోగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి


Thu,May 16, 2019 11:12 PM

రైతులకు గిట్టు బాటు ధరను కల్పించి, సకాలంలో డబ్బులను అందజేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని 24 గంటల్లోగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశించారు. మండల పరిధిలోని చింతకుంటలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కేంద్రం వద్ద ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి, అక్కడున్న రైతులతో మాట్లాడారు.

కొనుగోలు కేంద్రం వద్ద ఏమైనా సమస్యలున్నాయా? సిబ్బంది ఏమైనా ఇబ్బందులకు గురిచేస్తున్నారా? అని వారిని అడిగి తెలుసుకొగా, వారు అలాంటి సమస్యలేమి లేవని, సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ధా న్యాన్ని 24 గంటల్లోగా తూకం వేసి, కొనుగోలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డాకూర్‌ నర్సరీలో మొక్కల పెంపకంపై సంతృప్తి హరిహాతరం కార్యక్రమంలో భాగంగా డాకూర్‌లో ఏర్పాటు చేసిన నర్సరీని కలెక్టర్‌ పరిశీలించారు. మొక్కల పెంపకానికి కవర్లలో నింపిన నల్లమట్టిని తీసివేసి, ఎర్రమట్టిని వినియోగించాలని ఆయన సూచించారు.

నర్సరీల్లో 100 శాతం మొక్కలను కాపాడితే నర్సరీ యజమానికి రూ.5 వేలను బహుమానంగా అందజేస్తానన్నారు. నర్సరీలను మండలాల్లోని ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. డాకూర్‌ నర్సరీలో మొక్కల ఎదుగుదల చాలా బాగుందని నర్సరీ యజమాని రాములుకు కితాబునిచ్చి, ఆయనను సన్మానించారు. నర్సరీల్లో మొక్కల పెంపకం బాగోలేకపోతే చర్యలు తీసుకోవడమే కాదు, నర్సరీల్లో మొక్కల పెంపకం బాగున్నట్లయితే అందుకు కృషి చేసిన వారికి తగిన విధంగా గౌరవించి అభినందిస్తామన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...