ప్రతికుటుంబం మరుగుదొడ్డిని నిర్మించుకోవాలి


Thu,May 16, 2019 11:10 PM

వట్‌పల్లి: గ్రామాల్లో ప్రతి కుటుంబం మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని ఏపీడీ విశ్వప్రసాద్‌ సూచించారు. గురువారం ఖాదీరాబాద్‌, గౌతాపూర్‌, సాయిపేట గ్రామాల్లో స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్డి ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం మరుగుదొడ్డిని నిర్మించుకోవాలన్నారు. మరుగుదొడ్డి వినియోగం ద్వారా గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని పేర్కొన్నారు.

మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ప్రభుత్వం పూర్తి సాయం అందిస్తుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఈ నెల 25వరకు చివరి గడువుగా ఏపీడీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విద్యాసాగర్‌, ఏపీవో పుణ్యప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి రాజలింగం, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...