మహిళలు ఆరోగ్య నియమాలు పాటించాలి


Thu,May 16, 2019 11:10 PM

రాయికోడ్‌: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించినప్పుడే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారని ఎంపీడీవో స్టీవేన్‌నీల్‌ అన్నారు. గురువారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్యంపై అవగహన సదస్సులో ఆయన మాట్లాడుతూ మహిళలు పోషకాలున్న ఆహార పదార్థాలను తీసుకోవాలని అన్నారు. మంచి ఆహారంతో మహిళలకు వచ్చే వ్యక్తిగత రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. రక్తహీనత రాకుండా మహిళలు ఐరన్‌ లభించే ఆకుకూరలు, పండ్లు, బెల్లం, మాంసంలను క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు.

గర్భిణులు ఆరోగ్యంగా ఉండడం కోసం ఐకేపీ సిబ్బంది సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోగ్యం పట్ల మహిళలకు ఆవగాహన కల్పించాలని అన్నారు. పిల్లల పోషణ కోసం ఆరోగ్య చార్టును తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టిక ఆహారం అంగన్‌వాడీల నుంచి పొందాలన్నారు. ఐకేపీ సిబ్బంది గ్రామాల్లో పరిశుభ్రత నియమాలు పాటించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐకేపీ మండల అధికారి నర్సింహులు, మండల మహిళా సంఘాల అధ్యక్షురాలు శివలీలా, సిబ్బంది సమత పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...