ఏడు పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత


Thu,May 16, 2019 11:09 PM

-హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిందండ్రులు
జిన్నారం : పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు మరోసారి సత్తాచాటాయి. ప్రైవేటు పాఠశాలలకు కూడా అందని ఫలితాలను సాధించాయి. తెలంగాణ సర్కార్‌ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో ఈ ఫలితాలు సాధ్యమవుతున్నాయి. జిన్నారం మండలంలోని ఎనిమిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అలాగే జిన్నారంలో గిరిజన గురుకుల పాఠశాల, కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలు, బొల్లారంలో తెలంగాణ మోడల్‌ స్కూల్‌ ఉన్నాయి. ఈ ఏడాది మండలంలోని పదకొండు పాఠశాలల్లో 618 మంది విద్యార్థులు పది పరీక్షలు రాశారు.

ఇం దులో జిన్నారం, శివానగర్‌, వావిలాల, కొడకంచి, గిరిజన గురుకుల పాఠశాల, తెలంగాణ మోడల్‌ స్కూల్‌, కస్తూర్భా గాంధీ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. మోడల్‌ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు కీర్తి, దివ్యారెడ్డి, శివకుమార్‌లు 10/10 జీపీఏ సాధించి జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచారు. అలాగే కస్తూర్భా గాంధీ పాఠశాలకు చెందిన రజిత 9.7 జీపీఏ సాధించింది. జిన్నారం జిల్లా పరిషత్‌ ఉ న్నత పాఠశాలలో తెలుగు మీడియంలో శ్రావణి 8.5, ఇంగ్లీష్‌ మీడియంలో సాయిపూజ 8.3 జీపీఏ సాధించారు. గిరిజన గురుకుల పాఠశాలలో గోపాల్‌, వికాస్‌ అనే ఇద్దరు విద్యార్థులు 9.8 జీపీఏ సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో కూడా బోధన జరుగుతుండడంతో క్రమంగా విద్యార్థుల అడ్మిషన్లు పెరుగుతున్నాయి. పదో తరగతి, ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధిస్తుండడంతో విద్యార్థులు ఆలోచనలు, తల్లిదండ్రులు చూపు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలవైపు మళ్లుతున్నది. ప్రైవేటు పాఠశాలల్లో లేని మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండడం, శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉండడం తదితర అంశాలు ఫలితాల మెరుగుకు తోడవుతున్నాయి.

ప్రైవేటు పాఠశాలల్లో నెలకు వేల ఫీజులు కట్టి చదివించిన తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో వస్తున్న ఫలితాలను చూసి ఆలోచనలో పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తున్నారు. హోదా కోసమే ప్రైవేటులో పిల్లలను చదివించడమే తప్పా అక్కడా ఫలితాలు ఉండడంలేదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరుస్తామని అంటున్నారు. పదిలో మంచి రిజల్టును సాధించే ప్రభుత్వ పాఠశాలల్లో దూరమైనా సరే విద్యార్థులను చేర్చి చదివిస్తున్నారు. ఊట్లకు చెందిన పలువురు విద్యార్థులు బొంతపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ పదిలో మంచి ఫలితాలు వస్తున్నాయని పక్క గ్రామాల్లో హైస్కూల్స్‌ ఉన్న బొంతపల్లికి వెళ్తున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...