జీపీఎఫ్‌ నిధుల విడుదలకు లైన్‌ క్లియర్‌


Thu,May 16, 2019 11:07 PM

సంగారెడ్డి చౌరస్తా: జీపీఎఫ్‌ నిధుల విడుదలకు మార్గం సుగమమైందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మాణయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం పీఆర్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జడ్పీ సీఈవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్పీ సీఈవో సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కరించారని పేర్కొన్నారు. జనవరి నుంచి మార్చి వరకు ప్రభుత్వానికి శుక్రవారం చెక్కులు పంపించేందుకు సంబంధిత డిప్యూటీ సీఈవో అంగీకరించారని వెల్లడించారు.

జిల్లాలోని ఉపాధ్యాయుల జడ్పీ జీపీఎఫ్‌ రుణాలు, పార్ట్‌ఫైనల్‌, పదవీవిరమణ పొందిన వారి తుది చెల్లింపులు జనవరి 2019 నుంచి నిధులు విడుదల కాకుండా ఉన్న విషయాన్ని, ఉపాధ్యాయుల ఇబ్బందులను జడ్పీ సీఈవోకు వివరించామన్నారు. జడ్పీసీఈవో ను కలిసిన వారిలో పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మదన్‌గోపాల్‌, జిల్లా బాధ్యులు లక్ష్మయ్య, శ్రీనివాస్‌, నాగభూషణం తదితరులున్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...