రమ్మతులతో తీరిపోనున్న ఇబ్బందులు


Thu,May 16, 2019 11:07 PM

మనూరు: రోడ్డు మరమ్మతులతో ప్రయాణికులకు ఇబ్బందులు తీరిపోనున్నాయి. మనూరు మండలపరిధిలోని మాయికోడ్‌ గ్రామానికి ఉన్న ప్రధాన రోడ్డు పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో కొన్నిరోజులుగా ప్రయాణికులకు, వాహన చోదకులకు ఇబ్బందులు తప్పలేవు. రాయిపల్లి, దన్వార్‌, ఉసిరికెపల్లి, బోరంచ, దుదగొండ, తుమ్నూర్‌, రాణాపూర్‌, ముగ్దుంపూర్‌ గ్రామాల ప్రజలు మండలకేంద్రానికి వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో పలు గ్రామాల ప్రజలు రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నానా అవస్థలు పడేవారు.

ముఖ్యంగా మండలపరిధిలో ఉన్న బోరంచ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయ జాతరకు వెళ్లే భక్తులకు కూడా ఇదే రోడ్డు కావడం విశేషం. ప్రత్యేకించి వానకాలంలో ఈ రోడ్డు పై ప్రయాణం ఇబ్బందికరంగా ఉండేదని పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరమ్మతులకు గాను కోటి రూపాయల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడంతో రోడ్డు ఇబ్బందులు తీరిపోనున్నాయని వాహనచోదకులు, ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...