భక్తులతో ఆలయం కిటకిట


Thu,May 16, 2019 11:06 PM

మనూరు: బోరంచ నల్లపోచమ్మ ఆలయం గురువారం భక్తులతో సందడిగా మారింది. జాతర ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. ప్రత్యేకించి గురు, ఆదివారాల్లో ఆలయానికి వచ్చే భక్తులు అధికంగా రావడం విశేషం. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు బోనాల ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మొ క్కుబడుల చెట్టుకు కూ డా అత్యంత ప్రాముఖ్యంగా భావించి మొక్కు లు మొక్కుకుని ముడుపులు చెల్లించుకున్నారు.

గురువారం జాతర సమయంలో ఎండవేడిమిని అధికంగా ఉన్నప్పటికినీ భక్తులు క్యూలైన్‌లో నిల్చుండి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించే భక్తులు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడి ఉండాల్సి వచ్చింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దేవాదాయ శాఖవారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పలు సౌకర్యాలను కల్పించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...