సూర్య ప్రతాపం


Thu,May 16, 2019 11:05 PM

-పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భయపడుతున్న ప్రజలు
-ఇండ్లను విడిచి బయటకు రావాలంటే జంకుతున్న జనం

జిన్నారం : ఎండ వేడిమి రోజు రోజుకు పెరుగుతున్నది. రికార్డు స్థాయిలో గురువారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. గతంలో ఎన్నడూ లేని ఎండలు కాస్తుండడంతో ప్రజలు ఇండ్లను విడిచి బయటకు రాలేకపోతున్నారు. మండలంలోని పలు గ్రామాలలో జరుగుతున్న ఉపాధి పనులకు కూలీలు ఉదయమే వెళ్లి పదకొండు పదిగంటల వరకు ఇంటికి వచ్చేస్తున్నారు. రోడ్లపై వాహనాలపై వెళ్లలేని రీతిలో ఎండలు ప్రభావం చూపిస్తున్నాయి. ఫ్యాన్లు, ఎయిర్‌ కూలర్లు ఎండ వేడిమి నుంచి ఏమాత్రం ఉపశమనం ఇవ్వలేకపోతున్నాయి. ఉదయం పదిగంటలకే మద్యాహ్నాన్ని తలపిస్తున్నది. సాయంత్రం ఏడు గంటలైన ఇంట్లో వేడి తగ్గడం లేదు. రేకుల ఇండ్లు, బిల్డింగ్‌లలో పగటి వేళల్లో ఉండలేని పరిస్థితులు ఉంటున్నాయి. రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఇండ్లు చల్లబడడం లేదు. చుట్టు పక్కల గ్రామాలలో జరిగే పెండ్లిళ్లకు కుటుంబంతో బైక్‌పై వెళ్లలేకపోతున్నారు. కార్లు లేదా బస్సులో వెళ్తున్నారు. బందువుల ఇంటికి వెళ్లేందుకు కూడా ప్రజలు జంకుతున్నారు. ఎండ చల్లబడ్డంక సాయంత్రంపూట వెళ్తున్నారు. వేసవి సెలవులు వచ్చిన ఎండల భయంతో పిల్లలు, యువకులు ఎవ్వరూ కూడా మధ్యాహ్నం పూట బయట కనిపించడం లేదు. సాయంత్రం మాత్రమే క్రికెట్‌, వాలీబాల్‌ ఆడేందుకు వెళ్తున్నారు.

గ్రామాల్లో పశువులను మద్యాహ్నంపూట మేతకు కొట్టుకెళ్లడం లేదు. కొట్టాలలో కట్టేసి వాటికి గడ్డి వేస్తూ నీటిని పోస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో అధికంగా ఉన్న కోతులు సైతం ఎండ ప్రభావానికి కనిపించడం లేదు. చల్లబడ్డ తరువాత చెట్లపై, ఇండ్లపై కనిపిస్తున్నాయి. అవి తాగేందుకు నీళ్లు దొరకక ట్యాంకుల వద్ద, ఇం డ్లలోని నీటి నల్లాల వద్దకు వస్తున్నాయి. పిచ్చుకుల, పావురాల పరిస్థితి మరింత అద్వానంగా మారింది. ఊర పిచ్చుకలు ఎండకు అక్కడక్కడ నేలరాలిపోతున్నాయి. కొందరు ప్రకృతి ప్రేమికులు పక్షుల కోసం ఇండ్ల వద్ద ప్రత్యేకంగా పా త్రల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నీళ్లు ఎన్ని తాగిన దూప తీరడం లేదు. ఒక కుటుంబం మొత్తం రోజుకు ఇరవై లీటర్ల వాటర్‌ టిన్‌ నీటిని తాగుతున్నారు. ఫ్రిజ్‌ ఉన్నవారు చల్లనీటిని, ఫ్రిజ్‌లేని వారు కుండలను ఏర్పాటు చేసుకుని దాహం తీర్చుకుంటున్నారు. నిమ్మరసం, పుచ్చపండ్లను మధ్యాహ్నం పూట తీసుకుంటున్నారు. ఒకటి, రెండు వానలు గట్టిగా కురిస్తేనే వాతావరణం చల్లబడుతుందని పలువురు అంటున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...