‘పరిషత్‌'లో గెలిచేదెవరో..?


Thu,May 16, 2019 12:17 AM

కోహీర్‌ : మండల కేంద్రమైన కోహీర్‌లోని నాలుగు ఎంపీటీసీలతో పాటు మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. కోహీర్‌-1వ ఎంపీటీసీ స్థానంలో 1,964 మంది ఓటర్లకు గానూ 1,189 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోహీర్‌-2వ స్థానంలో 2,447 ఓటర్లకు గానూ 1,693 మంది, కోహీర్‌-3వ స్థానంలో 2,454ఓటర్లకు గానూ 1,575 మంది, కోహీర్‌-4వ స్థానంలో 1,952ఓటర్లకు గానూ 1,278మంది ఓటు వేశారు. కవేలిలో 1,994 ఓటర్లకు గానూ 1,512 మంది, దిగ్వాల్‌ గ్రామంలో 3,544 ఓటర్లకు గానూ 2,550 మంది, చింతల్‌ఘట్‌ ఎంపీటీసీ స్థానంలో 3,165 ఓటర్లకు గానూ 2,413 ఓటర్లు, నాగిరెడ్డిపల్లి ఎంపీటీసీ పరిధిలో 2,417 ఓటర్లకు గానూ 1,795 మంది, పైడిగుమ్మల్‌ స్థానంలో 2,071 ఓటర్లకు గానూ 1,748 మంది, బిలాల్‌పూర్‌ ఎంపీటీసీ స్థానంలో 2,879 మందికి గానూ 2,270 ఓటర్లు తమ ఓటు హక్కును ఎనయోగించుకున్నారు.

మనియార్‌పల్లి ఎంపీటీసీ స్థానంలో 2,736 ఓటర్లకు గానూ 2,073మంది, పర్సపల్లి ఎంపీటీసీ స్థానంలో 3,155 ఓటర్లకు గానూ 2,491 మంది ఓటు వేశారు. ఖానాపూర్‌ ఎంపీటీసీ పరిధిలో 2,865 ఓటర్లకు గానూ 2,327 మంది , మాచిరెడ్డిపల్లి ఎంపీటీసీ పరిధిలో 2,385 ఓటర్లకు గానూ 1,764 మంది, పీచెర్యాగడి ఎంపీటీసీ స్థానంలో 2,623 ఓటర్లకు గానూ 2,030 మంది, గురుజువాడ ఎంపీటీసీ పరిధిలో 2,986 ఓటర్లకు గానూ 2,241 మంది తమ ఓటు వేశారు. మండలంలో మొత్తానికి 41,628 ఓట్లకు గానూ 30, 949 ఓట్లు పోలయ్యాయి. 74.35 పోలింగ్‌ శాతం నమోదయ్యింది. 16 ఎంపీటీసీ స్థానాలకు గానూ 53 మంది అభ్యర్థులు రేసులో ఉన్నారు. జడ్పీటీసీ పదవి కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మ్యాతరి ఆనంద్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి గరుగుబాయి రాందాస్‌ మధ్య ప్రధాన పోటీ ఉన్నది. ఎవరు గెలుస్తారనేది ఈ నెల 27వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపుతో తేలనుంది.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...