జడ్పీపై గులాబీ జెండా..!


Fri,April 26, 2019 12:07 AM

- ఈ ఎన్నికల్లో వార్ వన్‌సైడే
- అన్ని గ్రామాల్లో కారుదే జోరు
- సమర్థులకే టికెట్లు కేటాయిస్తున్న టీఆర్‌ఎస్
- కాంగ్రెస్, బీజేపీ ఉనికే ప్రశ్నార్థకం
- అధికార పార్టీలో ఆశావహుల నుంచి తీవ్ర పోటీ
- అందరినీ సమన్వయ పరిచి అభ్యర్థుల ఎంపిక
- జిల్లాలో 25 జడ్పీటీసీ, 295 ఎంపీటీసీ స్థానాలు
- ఎమ్మెల్యేల చేతికి పార్టీ భీఫారాలు
- పర్యవేక్షిస్తున్న జిల్లా ఇన్‌చార్జి శేరి సుభాష్‌రెడ్డి

సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి : ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే విజయం.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు గులాబీ పార్టీకి పట్టం కడుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది విజయదుందుభీ మోగించింది. అలాగే ప్రస్తుతం జరుగనున్న జిల్లా పరిషత్, మండల పరిషత్‌పై గులాబీ జెండా ఎగురడం ఖాయమేనని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. పరిషత్ ఎన్నికల్లో పూర్తిగా ఏకపక్ష ఫలితాలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే వార్‌వన్ సైడేనని తెలుస్తున్నది. ఇప్పటికే మొదటి విడుత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ కూడా ముగిసింది. కాగా, జిల్లాలో 25 జడ్పీటీసీ, 295 ఎంపీటీసీ స్థానాలున్నాయి. మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోనున్నది. జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో సంగారెడ్డి మినహా మిగతా చోట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పని చేస్తున్న విషయం తెలిసిందే. అధిష్ఠానం ఎమ్మెల్యేలకు పార్టీ బీఫారాలు అందివ్వగా, పార్టీ శ్రేణులను సమన్వయ పరిచి సమర్థులకు టికెట్లు ఇస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ఇతర అంశాలను ఎమ్మెల్యే, పరిషత్ ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి శేరి సుభాష్‌రెడ్డి పరిశీలిస్తున్నారు.

జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమేనని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. పరిషత్ ఎన్నికల్లో పూర్తిగా ఏకపక్ష ఫలితాలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే వార్‌వన్ సైడే ఉండనున్నది. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మొదటి విడుత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ కూడా ముగిసింది. జిల్లాలో 25 మండలాలకు గాను 25 జడ్పీటీసీ, 295 ఎంపీటీసీ స్థానాలున్నాయి. మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోనున్నది. అధికార టీఆర్‌ఎస్‌లో ఆశావహుల నుంచి తీవ్ర పోటీ ఉండగా కాంగ్రెస్, బీజేపీలలో అసలు టికెట్లు అడిగే వారే లేకపోవడం గమనార్హం. జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో సంగారెడ్డి మినహా మిగతా చోట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పనిచేస్తున్న విషయం తెలిసిందే. అధిష్టానం ఎమ్మెల్యేలకు పార్టీ బీఫారాలు అందివ్వగా పార్టీ శ్రేణులను సమన్వయ పరిచి సమర్థులకు టికెట్లు ఇస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక ఇతర అంశాలను ఎమ్మెల్యే, పరిషత్ ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి శేరి సుభాష్‌రెడ్డి పరిశీలిస్తున్నారు.

అన్ని పల్లెల్లో గులాబీదే జోరు...
జిల్లాలో అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగుతున్నది. శాసన సభ ఎన్నికలతో పాటు సర్పంచ్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ ఎదురులేని జోరు కొనసాగించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జిల్లా పరిధిలోని మెదక్, పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ రానున్నది. మే 23న ఫలితాలు వెల్లడికానున్నది. వరుస జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయాన్ని సాధిస్తూ జోరుమీదున్న ఆ పార్టీ శ్రేణులు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లురుతున్నారు. జిల్లాలో 25 మండలాల్లో మొత్తం 647 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 295 ఎంపీటీసీ స్థానాలున్నాయి. దాదాపు అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు పనిచేస్తున్నారు. 25 జడ్పీటీసీ, అన్ని ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని మరోసారి జిల్లా సత్తా చాటుతామని పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు. కాగా మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. మొదటి విడుతలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌లోని 9 మండలాల్లోని 103 ఎంపీటీసీ స్థానాలను ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యింది.

సమర్థుల ఎంపికకు ఎమ్మెల్యేలు కసతర్తు...
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ సమర్థులను బరిలో దింపుతున్నది. ప్రతిపక్ష పార్టీల నుంచి కనీస పోటీ లేకపోయినప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. జిల్లాలో సంగారెడ్డి మినహా పటాన్‌చెరు, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. పార్టీ అధిష్టానం వారికే భీ ఫారాలను అందించింది. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ సమర్థులను గుర్తించి టికెట్లు కేటాయిస్తున్నారు. టికెట్ల కేటాయింపుకు ముందే అందరిని కూర్చోబెట్టి సమన్వయం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పార్టీలో కొత్తగా చేరిన వారిని అందరికి న్యాయం జరిగేలా చూస్తున్నారు. ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, గూడెం మహిపాల్‌రెడ్డిలు రోజువారీగా స్థానికంగానే ఉంటూ అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉంటున్నారు. కాగా సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అభ్యర్థులను ఎంపిక చేసి అందరికి బీఫారాలు అందించారు. ఇక్కడ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యింది కూడా. అన్ని చోట్ల సమర్థులను గుర్తించి టికెట్లు కేటాయిస్తుండడం, ప్రతిపక్ష పార్టీల్లో కనీసం ఎన్నికల సందడే లేకపోవడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించనున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

జగ్గారెడ్డి మౌనం... కాంగ్రెస్ ఖతం...
జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక నియోజకవర్గం సంగారెడ్డి. స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల కాలంలో మౌనంగా ఉంటూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన పెద్దగా ప్రచారం చేయలేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా పట్టించుకోవడం లేదు. అయితే జగ్గారెడ్డి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతుండగా ఆయన మాత్రం స్పందించడం లేదు. ఆయన పార్టీ మార్పు అంశం పక్కన పెడితే కాంగ్రెస్‌లో మాత్రం చురుకుగా పనిచేయడం లేదని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అలాగే వివిధ సందర్భాల్లో జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు కూడా. ఆయన నియోజకవర్గానికే రాకపోతుండడంతో ప్రస్తుతం ఇక్కడ కూడా టీఆర్‌ఎస్ హవానే కొనసాగుతున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ రానున్నదని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి మౌనంతో సంగారెడ్డిలో కూడా కాంగ్రెస్ దాదాపుగా ఖతం అయ్యిందని, కారుజోరు కొనసాగుతున్నదని చెప్పుకోవచ్చు.

జడ్పీ కైవసం ఖాయమే...
జిల్లా పరిషత్‌పై టీఆర్‌ఎస్ గులాబీ జెండా ఎగురవేయడమే దాదాపుగా ఖాయమేనని చెప్పుకోవచ్చు. జడ్పీటీసీ, ఎంపీటీసీ పోటీకి టీఆర్‌ఎస్‌లో తీవ్రమైన పోటీ ఉండగా కాంగ్రెస్, బీజేపీల్లో అభ్యర్ధులు పోటీకి రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌కి చెందిన సీనియర్ నాయకులైన మాజీ మంత్రులు దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ లాంటి వారు కూడా ఎన్నికలను పట్టించుకోవడం లేదు. ఎలాగో ఓటమి తప్పదనే భావనతోనే వారు పరిషత్ ఎన్నికలను దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ నేతలు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొనలేదు. గతంలో తాము ప్రాతినిథ్యం వహించిన సొంత నియోజకవర్గాలకే మాజీ మంత్రులు పరిమితమైన విషయం తెలిసిందే. అయితే టీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కని వారు తమ వద్దకు వస్తే వారికి అవకాశం ఇవ్వడానికి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. సాధ్యమైనంత వరకు అందరినీ సమన్వయ పరిచి టికెట్లు కేటాయిస్తుండడంతో టీఆర్‌ఎస్ నుంచి ఎవరు బయటకు రాకపోవడం కూడా ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి జిల్లాలో ప్రశ్నార్థకంగా ఉన్నది. ఈ క్రమంలో జడ్పీపై టీఆర్‌ఎస్ జెండా ఎగురడం ఖాయమేనని స్పష్టం అవుతున్నది.

ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పర్యవేక్షణ...
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల జిల్లా ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. అభ్యర్ధులను ఎంపిక, ఇతర అంశాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రోజువారీగా స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు జిల్లాకు వచ్చి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు కూడా. మొదటి విడుత ఎన్నికలు జరుగనున్న సంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో అభ్యర్ధులను ఎంపికను పర్యవేక్షించారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో బీ ఫారాలు అందించారు. సంగారెడ్డి జిల్లాలో మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా శేరి పరిషత్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...