జడ్పీటీసీకి నో రిజెక్షన్స్


Fri,April 26, 2019 12:05 AM

సంగారెడ్డి చౌరస్తా : జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన మొదటి విడుత నామినేషన్ల పరిశీలన గురువారం పూర్తయింది. జిల్లాలోని మొత్తం 25 మండలాలకు జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలలో భాగంగా మొదటి విడుతలో 9 మండలాలకు స్వీకరించిన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించగా, ఎంపీటీసీ స్థానాలకు ఒక నామినేషన్ తిరస్కరణకు గురి కాగా, జడ్పీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా తిరస్కరణకు గురికాలేదు. మొదటి విడుతలో 72 మంది అభ్యర్థులు 97 నామినేషన్లను జడ్పీటీసీ స్థానాలకు దాఖలు చేయగా, అందులో ఒక్కో అభ్యర్థికి సంబంధించి ఒక నామినేషన్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకోవడంతో మొత్తం 72 మంది అభ్యర్థులు, 72 నామినేషన్లను 9 మండలలాకు దాఖలు చేసినైట్టెంది. ఇందులో బీజేపీ నుంచి 12 నామినేషన్లు దాఖలు చేయగా, సీపీఐ(ఎం) 1, కాంగ్రెస్ 20, టీఆర్‌ఎస్ 24, టీడీపీ 2, వైఎస్‌ఆర్‌సీపీ 1, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 2, స్వతంత్రులు 10, మొత్తం 72 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అదేవిధంగా 103 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 741 నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల పరిశీలనలో కొండాపూర్ మండలంలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగతా నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని అధికారులు గుర్తించారు.

అయితే కొందరు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో ఒక్కో అభ్యర్థికి సంబంధించి ఒక నామినేషన్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 585 మంది అభ్యర్థులు 585 నామినేషన్లను దాఖలు చేశారని అధికారులు లెక్క తేల్చారు. ఇందులో పార్టీల వారిగా బీజేపీ 88 నామినేషన్లను దాఖలు చేయగా, సీపీఐ 5, సీపీఐ(ఎం) 2, కాంగ్రెస్ 172, టీఆర్‌ఎస్ నుంచి అత్యధికంగా 231, టీడీపీ 4, వైఎస్‌ఆర్‌సీపీ 1, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 3, స్వతంత్రులు 79 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగియడంతో ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా వెలువడనున్నది. ఇదిలా ఉండగా రెండో విడుత నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 26 నుంచి మొదలుకానున్నది.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...