వందశాతం మరుగుదొడ్లు నిర్మించాలి


Fri,April 26, 2019 12:05 AM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ : ఆయా శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా కృషి చేయాలని సంగారెడ్డి డీఆర్‌డీవో శ్రీనివాస్ సూచించారు. గురువారం సాయంత్రం నారాయణఖేడ్‌లోని పాలిటెక్నిక్ కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేసి మే 25వ తేదీ వరకు లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో జిల్లాలోనే నారాయణఖేడ్ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిందని, ఇందు కోసం ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా ప్రతి పంచాయతీకి ఒక నర్సరీ చొప్పున ఏర్పాటు చేసే బాధ్యతను ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు నర్సరీల ఏర్పాటు విషయమై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్దేశించిన గడువులోపు మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల వారీగా సమీక్ష జరిపారు. కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీవో సూర్యారావు, అసిస్టెంట్ పీడీ ఎల్లయ్య, ఏపీడీ రాజు, ఎస్బీఎం కో-ఆర్డినేటర్ స్వామి, డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ఏపీవోలు, ఏపీఎంలు, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, వీఓఏలు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...