పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి


Fri,April 26, 2019 12:05 AM

అందోల్, నమస్తే తెలంగాణ: ప్రపంచ మలేరియా వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జోగిపేట పట్టణంలో అవగాహన ర్యాలీని చేపట్టారు. గురువారం స్థానిక ప్రభుత్వ దవాఖాన నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల మీదుగా కొనసాగించారు. ఈ ర్యాలీ జోగిపేట సీఎస్‌సీ, పీపీ యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ మలేరియా వ్యాధి భారిన పడకుండా ప్రజ లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల రాకుం డా చూసుకోవాలని, పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని వారు సూచించారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ వీరేశం, సీనియర్ ఎఎన్‌ఎం భూమమ్మ పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...