కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు


Fri,April 26, 2019 12:05 AM

జిన్నారం : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో మెజార్టీతో గెలుపొందాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఎనిమిది ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాల గెలుపుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కష్టపడాలన్నారు. గురువారం జిన్నారం, పెద్దమ్మగూడెం గ్రామాలకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జిన్నారం మాజీ ఎంపీటీసీ భారతమ్మ, పాండరయ్యగౌడ్, వడ్ల భూషణంతో పాటు పెద్దమ్మగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్, చిత్తారి, మహేశ్, భాస్కర్, నవీన్, నర్సింహులు, రాజు, కిరణ్ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ కండువా లు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ జిన్నారం మండలంలోని ఎనిమిది ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీని టీఆర్‌ఎస్ నాయకులు గెలుపొందాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుంచాల ప్రభాకర్, టీఆర్‌ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సింహారెడ్డి, భోజిరెడ్డి, గాండ్లశ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

బొల్లారంలో...
మండలంలోని బొల్లారం మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు చంద్రారెడ్డి సమక్షంలో ముత్తు, శివ, వంశీ, అనిల్, రాఖీ, సాయి యువకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి టీఆర్‌ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వరప్రసాద్‌రెడ్డి, యువనేత ప్రవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
గుమ్మడిదల : కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. గురువారం మండలంలోని దోమడుగులో కాంగ్రెస్‌కు చెందిన ర్యాలమడుగు గోపి, అన్నయ్యగారి కృష్ణారెడ్డి, వీరారెడ్డి, బొర్రవెంకట్‌రెడ్డి తదితరులు టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ రాజశేఖర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితో పాటు సర్పంచ్ ఆలే నవీనా శ్రీనివాస్‌రెడ్డి, మమతావేణు, జిల్లా నాయకుడు కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కుమార్‌గౌడ్, మండల నాయకులు మంగయ్య, మల్లేశ్, అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...