ముగిసిన మొదటి విడుత నామినేషన్లు


Wed,April 24, 2019 11:35 PM

- మూడో రోజు 73 జెడ్పీటీసీ, 540 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు
- నామినేషన్ వేసిన 62 మంది జెడ్పీటీసీ, 482 మంది ఎంపీటీసీ అభ్యర్థులు
- ఇప్పటివరకు 97 జెడ్పీటీసీ, 741 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు
- నేడు నామినేషన్ల పరిశీలన
- మే 6న మొదటి విడుత పోలింగ్
- రేపటి నుంచి 28 వరకు రెండో విడుత నామినేషన్లు

సంగారెడ్డి చౌరస్తా : జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన మొదటి విడుత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని మొత్తం 25మండలాలకు జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మొదటి విడుతలో 9మండలాలకు ఈ నెల 22న నామినేషన్ల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం చివరి రోజు నామినేషన్ల స్వీకరణలో భాగంగా 73నామినేషన్లను జడ్పీటీసీ స్థానాలకు దాఖలు చేయగా, 540నామినేషన్లను ఎంపీటీసీ స్థానాలకు తమ నామినేషన్లకు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 62మంది అభ్యర్థులు జడ్పీటీసీ స్థానాలకు 97నామినేషన్ దాఖలు చేయగా, అమీన్‌పూర్ మండలంలో 14నామినేషన్లు, పటాన్‌చెరులో 15, జిన్నారం 8, గుమ్మడిదల 10, హత్నూర 8, కొండాపూర్ 16, సదాశివపేట 10, కంది 9, సంగారెడ్డిలో 7 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

ఇందులో బీజేపీ 14, సీపీఐ(ఎం) 1, కాంగ్రెస్ 29, టీఆర్‌ఎస్ 36, టీడీపీ 2, వైఎస్‌ఆర్‌సీపీ 1, స్వతంత్రులు 11, మొత్తం 97 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అదే విధంగా 103ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 741నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో భాగంగా అమీన్‌పూర్ మండలంలో 27నామినేషన్లు, పటాన్‌చెరులో 159, జిన్నారం 36, గుమ్మడిదల 48, హత్నూరలో అత్యధికంగా 162, కొండాపూర్ 92, సదాశివపేట 83, కంది 94, సంగారెడ్డిలో 40నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆయా పార్టీల వారిగా బీజేపీ 95, సీపీఐ 5, సీపీఐ(ఎం) 2, కాంగ్రెస్ 227, టీఆర్‌ఎస్ అత్యధికంగా 300, టీడీపీ 7, వైఎస్‌ఆర్‌సీపీ 1, స్వతంత్రులు 101 నామినేషన్లు, మొత్తం 741నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇదిలా ఉండగా, మొదటి విడుత నామినేషన్ల పర్వం ముగియడంతో ఈ నెల 25న ఆయా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ 28న మధ్యాహ్నం 3గంటలలోగా నామినేషన్ల ఉప సంహరణకు గడువు విధించారు. మే 6న మొదటి విడత ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడుత నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 26 నుంచి 28 వరకు కొనసాగనున్నది.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...