ముగిసిన నామినేషన్లు


Wed,April 24, 2019 11:35 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు తొలి విడుతలో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. బుధవా రం సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 304నామినేషన్లు దాఖలు అయ్యాయి. అయా మండల పరిధిలోని మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు నామినేషన్లను స్వీకరించారు. పోలీసులు కార్యాలయాల ఆవరణలో భారీకేడ్లు ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థుల వెంట బలపర్చే వారిని మాత్రమే అనుమతించారు. నామినేషన్ల పత్రాలను కార్యాలయాల ఆవరణలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సిబ్బందితో పరిశీలంచిన తర్వాత దాఖ లు చేయడానికి లోపలికి అనుమతించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి తరలివచ్చిన కార్యకర్తలతో కార్యాలయాలు జనంతో సందడిగా మారిం ది. అందులో 4జడ్పీటీసీలకు 42నామినేషన్లు దాఖలు కాగా, 47ఎంపీటీసీలకు చివరి రోజు కావడంతో భారీగా 262నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు తెలిపారు. సంగారెడ్డి మండలంలో 7ఎంపీటీసీలకు 27నామినేషన్లు, కంది మండలంలో 14ఎంపీటీసీలకు 94నామినేషన్లు, కొండాపూర్ మండలంలో 12ఎంపీటీసీలకు 58నామినేషన్లు, సదాశివపేట మండలంలో 14ఎంపీటీసీ స్థానాలకు 83నామినేషన్లను పార్టీల వారిగా వేశారు. 4జడ్పీటీసీలకు చివరిరోజు 42నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు అన్నా రు.

కొండాపూర్ మండలంలో మొత్తం 58ఎంపీటీసీ అభ్యర్థులు కాంగ్రెస్ తరఫున 16, టీఆర్‌ఎస్ 18, బీజేపీ10, ఇండిపెండెంట్ 12, సీపీఐఎం 1, పార్వర్డ్ బ్లాక్ తరుపున ఒక నామినేషన్ వేశారు. సదాశివపేట మండలంలో చివరి రోజు 83ఎంపీటీసీ అభ్యర్థులు టీఆర్‌ఎస్ తరుపున 36, కాంగ్రెస్ 29, బీజేపీ14, ఇండిపెండెంట్లుగా 4నామినేషన్లు దాఖలు చేశారు. సంగారెడ్డి మండలంలో 27ఎంపీటీసీ అభ్యర్థులు టీఆర్‌ఎస్ తరుపున 12, కాంగ్రెస్ 8, బీజేపీ 5, ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కంది మండలంలో 94నామినేషన్లలో టీఆర్‌ఎస్ నుంచి 30, కాంగ్రెస్ 27, బీజేపీ 18, సీపీఐ 1, టీడీపీ 1, ఇండిపెండెంట్లుగా 17మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే జడ్పీటీసీ అభ్యర్థులుగా సదాశివపేట మండలం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులు 4, కాంగ్రెస్ 4, బీజేపీ 2నామినేషన్ దాఖలు అయ్యాయి. కొండాపూర్ మండలం నుంచి 9మంది అభ్యర్థులలో టీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 3, బీజేపీ 1 ఇండిపెండెంట్లుగా 3నామినేషన్లు వేశారు. కంది మండలంలో 9మంది అభ్యర్థులు వేయగా టీఆర్‌ఎస్ 4, కాంగ్రెస్ 2, బీజేపీ, సీపీఐఎమ్, ఇండిపెండెండ్ అభ్యర్థులు ఒక్కొక్క నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి మండలంలో 7జడ్పీటీసీ అభ్యర్థులలో టీఆర్‌ఎస్ 5, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...