ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి


Wed,April 24, 2019 11:34 PM

సంగారెడ్డి చౌరస్తా : జిల్లాలో జరుగనున్న జడ్ఫీటీసీ, ఎం పీటీసీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ప్రాదేశిక (పరిషత్) ఎన్నికల సాధారణ పరిశీలకురాలు వాకాటి కరుణ సూచించారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా జిల్లాకు నియామకమైన ఐఏఎస్ అధికారిణి వాకాటి కరుణ బుధవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ హనుమంతరావు పుష్పగుచ్ఛం అందజేసి కరుణకు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమాచార విభాగం వీడియోకాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన పోలింగ్ పర్సన్స్ రెండో విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. పోలింగ్ పర్సన్స్ ర్యాండమైజేషన్‌ను పరిశీలించిన పరిశీలకురాలు సంతృ ప్తి వ్యక్తం చేశారు. అనంత రం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ హనుమంతరావు, జేసీ నిఖిల, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలతో సమావేశమై జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు, సిబ్బంది శిక్ష ణా కార్యక్రమా లు, బందోబస్తు, తదితర విషయాలపై ఆరా తీశా రు. ఎన్నికల నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఎన్నిక లు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని వాకాటి కరుణ సందర్శించారు. అక్కడ దాఖలవుతున్న నామినేషన్ల ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుల వెంట కలెక్టర్ హనుమంతరావు, జేసీ నిఖిల, జడ్పీ సీఈవో రవి, డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్డీవో శ్రీను పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...