దాతల ఔదార్యం.. భక్తులకు సౌకర్యం


Wed,April 24, 2019 11:34 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకు వస్తుండడంతో భక్తులకు మరి న్ని వసతులు సమకూరుతున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు దాతలు లక్షలాది రూపాయలు విరాళాలు ఇచ్చి ఔదార్యం చూపిస్తుండంతో భక్తులకు సౌకర్యాలు కలుగుతున్నాయి. స్వా మి వారి క్షేత్రంలో భక్తులకు ఎంతో అవసరమైన గదుల నిర్మాణానికి పలువురు దాతలు ముందుకు వచ్చి నిధు లు ఇవ్వడంతో కాటేజీలు నిర్మాణానికి నోచుకుంటున్నా యి. మల్లన్న క్షేత్రంలో భక్తుల కోసం కాటేజీ నిర్మించేందుకు హైదరాబాద్ నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన గడ్డం మహేశ్‌యాదవ్ అనే భక్తుడు రూ.25 లక్షలు విరాళంగా అందించారు. మహేశ్‌యాదవ్ విరా ళం ఇవ్వడంతో పాటు ఆయనే కాంట్రాక్టర్‌ను కేటాయించి ఆలయ నియమ, నిబంధనల మేరకు ఆధునిక వసతులతో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌ను ఆలయ సెంట్రల్ స్టోర్‌కు కేటాయించడంతో పాటు మొదటి, రెండవ అంతస్తును భక్తులకు ఉపయోగపడే విధంగా నిర్మాణం పూర్తి చేశారు.

నిర్మాణ పనులు పూర్తి కావడంతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆలయ సెంట్రల్ స్టోర్‌ను ఏర్పాటు చేసి ఆలయవర్గాలు వినియోగంలోకి తీసుకువచ్చారు. రానున్న కొద్దిరోజుల్లో భక్తులకు రెండంతస్తుల భవనం అందుబాటులోకి రానుంది. కాగా దాసారం గుట్టపై రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రూ.2కోట్లతో అత్యాధునిక వసతులతో అతిథి గృహాన్ని నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాతలు ముందు కు వచ్చి నిధులు కేటాయించి గదుల నిర్మాణాలకు శ్రీకారం చుడుతుండడంతో మల్లన్న భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దాతలు ముందుకు రావాలి
స్వామి వారి క్షే త్రంలో భక్తులకు వసతులు కల్పించేందుకు ప్రభు త్వం నిధులు మంజూరు చేసిం ది. మల్లన్న భ క్తుల కోసం నిర్మించే కాటేజీల నిర్మాణానికి దాతలు ముం దుకు వచ్చి నిధులు వెచ్చిస్తే పనులు చేపడుతాం. మల్లన్న క్షేత్రంలో అభివృద్ధి పనుల తో పాటు భక్తులకు సేవలందించేందుకు నిత్యం ఆలయ ధర్మకర్తల మం డలి కృషి చేస్తున్నది.
- సెవెల్లి సంపత్ (మల్లన్న ఆలయ చైర్మన్)

భక్తుల సేవే భగవంతుడి సేవ
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో తమ వంతుగా క్షేత్రం లో జీ-ప్లస్2 బిల్డింగ్ నిర్మించాను. ప్రతి యేటా స్వామి వారి దర్శనం కోసం వస్తున్న క్రమంలో భక్తులకు గదుల కోసం పడే తిప్పలు గమనిం చి భవన నిర్మాణ పనులకు రూ.25 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేయించా. భక్తుల సేవే భగవంతుడి సేవని, భక్తులకు రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించా.
గడ్డం మహేశ్‌యాదవ్ (మల్లన్న భక్తుడు)


29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...