ముగిసిన వీరభద్రేశ్వర స్వామి జాతర


Wed,April 24, 2019 11:34 PM

న్యాల్‌కల్ : మండలంలోని మరియంపూర్ గ్రామ శివారులోని వీరభద్రేశ్వర స్వామి జాతరలో భాగంగా బుధవారం నిర్వహించిన కుస్తీ పోటీలు అలకరించాయి. స్థానిక ఆలయ వద్ద నిర్వహించిన కుస్తీ పోటీలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. ఉర్సు నిర్వాహకులు కుస్తీ పోటీలకు ఏర్పాటు చేయగా, హద్నూర్ పోలీస్ సిబ్బం ది బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నారాయణఖేడ్ ప్రాంతంలోని కరస్‌గుత్తికి చెందిన మల్లయోధుడు భగత్‌సింగ్ కుస్తీ పోటీలో విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహక కమిటీ అధ్యక్షుడు బస్వరాజ్ పాటిల్ విజేతకు ఐదు తులాల వెండి కడియాన్ని బహుమతిని అందజేశారు. ఇదిలాఉండగా వీరభద్రేశర స్వామి జాతర ముగింపు ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసిపోయింది. తెల్లవారు జామున గ్రామంలోని ప్రధాన వీధుల గుండా స్వామి వారి రథోత్సవాన్ని ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. జాతరలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, నిర్వహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...