నామినేషన్ల జోరు


Tue,April 23, 2019 11:32 PM

సంగారెడ్డి చౌరస్తా: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు జోరందుకున్నది. మంగళవారం రెండో రోజు జిల్లాలో పెద్ద మొత్తంలో అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడుతలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా మొత్తం 9 మండలాలకు గాను 15 మంది అభ్యర్థులు జడ్పీటీసీ స్థానాలకు 16 నామినేషన్లను నామినేషన్లను దాఖలు చేయగా, 135 మంది అభ్యర్థులు 138 నామినేషన్లను ఎంపీటీసీ స్థానాలకు తమ నామినేషన్లకు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 24మంది అభ్యర్థులు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేయగా అందులో అత్యధికంగా అమీన్‌పూర్ మండలంలో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తరువాత స్థానంలో కొండాపూర్‌లో 6 నామినేషన్లు, జిన్నారంలో 3, పటాన్‌చెరు, హత్నూర మండలాల్లో రెండు చొప్పున నామినేషన్లు దాఖలు కాగా, సదాశివపేట, కంది.

సంగారెడ్డి మండలాలో ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలు అయ్యాయి. అత్యల్పంగా గుమ్మడిదల మండలంలో ఇప్పటివరకు నామినేషన్లు బోణీ కాలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 7 నామినేషన్ల చొప్పున దాఖలు కావడం విశేషం. అటు ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 301 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో అత్యధికంగా పటాన్‌చెరు మండలంలో 53 నామినేషన్లు దాఖలు కాగా, అత్యల్పంగా జిన్నారం మండలంలో 8 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అదేవిధంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు అత్యధికంగా 79 నామినేషన్లను దాఖలు చేయగా, కాంగ్రెస్ అభ్యర్థులు 50, స్వతంత్రులు 45, బీజేపీ అభ్యర్థులు 25నామినేషన్లను దాఖలు చేశారు. జిల్లాలోని మొదటి విడుతలో ఎన్నికలు జరిగే 9 మండలాలకు సంబంధించి రెండో రోజు దాఖలైన నామినేషన్లతో పాటు ఇప్పటివరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...