వ్యక్తిగత మరుగుదొడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి


Tue,April 23, 2019 11:27 PM

రాయికోడ్: వ్యక్తిగత మరుగుదొడ్లపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు మహిళా సంఘాల లావాదేవీలపై సిబ్బంది సమీక్షలు నిర్వహించాలని ఎంపీడీవో స్టీవేన్‌నీల్ అన్నారు. మంగళవారం రాయికోడ్‌లోని పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల వీవోఏల సమావేశంలో మాట్లాడారు. స్త్రీనిధి పొదుపులు, బ్యాంకు లింకేజీలు, బ్యాంకులో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపులు, సకాలంలో చెల్లించేందుకు వీవోఏలు ప్రత్యేక దృషి సారించాలని సూచించారు. ప్రతి మహిళ బ్యాంకు రుణం పొందుతున్న సంఘం సభ్యురాలు సమగ్ర కుటుంబ సమాచారంతో పాటు నిధుల వినియోగ ధ్రువీకరణ ఆధార్, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలన్నారు.

ప్రభుత్వం ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో మందుకు సాగుతుందన్నారు. ఈ క్రమంలోనే గడిచిన ఆరు నెలలుగా మరుగుదొడ్ల నిర్మాణం కోసం అహర్నిషలు శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. మండలంలో ప్రసుత్తం 4027 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 3472 పూర్తయ్యాయన్నారు. ఇంకా 297 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నిర్మాణాలు ప్రారంభమైన వాటిని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు మంజూరై నేటికీ ప్రారంభించుకోనివి, నిర్మించుకునేలా చైతన్యం కలిగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పొదుపు సంఘాల మహిళలు ముందుకొస్తే సాధించలేనిది ఏదీ ఉండబోదన్నారు. తమ కృషికి పొదుపు సంఘాల సహకారం తోడైతే నిర్దేశించుకున్న లక్ష్యాలను త్వరితగతిన చేరుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. సమావేశంలో ఐకేపీ అధికారి నర్సింహులు, సిబ్బంది, వివిధ గ్రామాల మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...