గీతమ్‌లో సీఏఈ అంతర్జాతీయ సదస్సు


Tue,April 23, 2019 11:26 PM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ : గీతమ్‌లో సీఏఈ అంతర్జాతీయ సదస్సు జరుగునున్నదని ఆ విద్యా సంస్థ ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ అన్నారు. మంగళవారం గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్ నుంచి విడుదల చేసిన ఓ ప్రకటనలో ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ అంతర్జాతీయ సందస్సుకు హైదరాబాద్ లోని గీతమ్‌డీమ్డ్ విశ్వవిద్యాలయం వేదిక కాబోతున్నదని తెలిపారు. అంతర్జాతీయంగా ఉన్న విద్యావేత్తలు, పరిశోధ కులు, ఇంజినీర్లు, మేనేజర్లను ఒక వేదికపైకి తీసుకొచ్చి మెకానిక్స్, సీఏఈ పరికరాల వినియోగంలో అధునాతన పరిశోధనలను గురించి చర్చించే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన అన్నారు.

ఈ ఏడాది డిసెంబర్ 13-14వ తేదీలలో నిర్వహించనున్న ఈ సదస్సులో పత్ర సమర్పణ చేయదలుచుకున్న వారు నిర్దేశిత ప్రమాణాల మేరకు ఆన్‌లైన్‌లో (www.cae 2019gitam.edu) అబ్‌స్ట్రాక్ట్‌లను సమర్పించవచ్చన్నారు. ఈ అమూలాగ్రం సమీక్షించి, ఆమోదించిన అబ్‌స్ట్రాక్ట్‌లను సదస్సులో ప్రచురిస్తామని తెలిపారు. పరిశోధన పత్రాలను యూజీసీ ఆమోదం పొందిన ఐజేఏటీఈఈ ప్రత్యేక సంచికలో ప్రచురించడంతో పాటు ఐఎస్‌ఎస్‌ఎన్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో పెడుతామని ప్రొ. వీసీ వివరించారు. ఆమూర్త (అబ్‌స్ట్రాక్ట్స్) పత్రాలను 2019 జూలై 1లోగా సమర్పించాలని, పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన పత్రాలను సెప్టెంబర్ 15లోగా సమర్పించాలని ప్రొఫెసర్ శివప్రసాద్ స్పష్టికరించారు. సదస్సులో పాల్గొనదలచిన వారు 2019 నవంబర్ 1నుంచి 15వరకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ముందుగా లేదా బృందాలుగా పేర్లు నమోదు చేసుకునేవారికి పదిశాతం రుసుము తగ్గిస్తామని వివరించారు.

వర్క్‌షాప్
సదస్సు కంటే ముందు, కృత్రిమ మేథ, తయారీలో సమగ్ర శిక్షణ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్ ఇన్ మాన్యు ఫ్యాక్షరింగ్)పై పరిశ్రమ, విద్యారంగంలో సుశిక్షుతులైన వారితో డిసెంబర్ 11,12తేదీలలో వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రొఫెసర్ శివప్రసాద్ వివరించారు. సదస్సులో పాల్గొనదల్చిన వారి పేర్లు నమోదు, రుసుము తదితర వివరాల కోసం సీఏఈ కార్యాలయం 08455-221 383/384 లేదా caeconference@gitam.eduకు ఈ మేయిల్ చేయాలని సూచించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...