8గుంటల కోసం పదేండ్లుగా నిరీక్షణ


Tue,April 23, 2019 11:25 PM

పుల్కల్ : అమ్మింది కొంత భూమి అయితే మొత్తం భూమిని అక్రమించారు. అక్రమణదారులను ఎదిరించలేక అమ్మగా మిగిలిన భూమిని సర్వే చేయమంటే సర్వేయర్ కాదు పొమ్మంటున్నాడు. దీంతో దిక్కు తోచని ఆ యాజమాని పుల్కల్ మండల రెవెన్యూ అధికారులను సంప్రదించిన ఫలితం దొరకలేదు. అమ్మగా మిగిలిన భూమికి హక్కు పత్రాలున్న యాజమాని ఆ భూమిని పదేండ్లుగా సాగు చేయడం లేదు. సంగారెడ్డి జిల్లా పుల్క ల్ మండలం మిన్‌పూర్ గ్రామానికి చెందిన మహ్మద్ మైనొద్దిన్ బందువైన తాజొద్దిన్ నుంచి సర్వే నంబర్ 134/ఆ2లో 8గుంటల భూమిని కొనుగోలు చేశారు. జోగిపేట సబ్‌రిజిస్టార్‌లో 2009లో 4084డాక్యుమెం ట్ నంబర్‌తో రిజిస్టర్ అయింది. ఐతే మహ్మద్ మైనొద్ది న్ తండ్రి శరీఫ్ తనకున్న 27గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన ఇందూరు అంజయ్య, ఇందూరు నాగయ్యలకు అమ్మిండు.

ఐతే వీరు శరీఫ్ అమ్మిన 12 గుంటలతో పాటు మైనొద్దిన్‌కు చెందిన అదే సర్వే నంబ ర్‌లోని 8గుంటల భూమిని కూడా అక్రమించి సాగు చేసుకుంటున్నాడు. దీంతో మైనొద్దిన్ పలుమార్లు గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టిన ఫలితం లేక పోవడంతో సర్వే కోసం 2018సెప్టెంబర్ 5న దరఖాస్తు చేసుకున్నా డు. సర్వే కోసం పుల్కల్ తహసీల్దార్ కార్యాలయానికి మైనొద్దిన్ వచ్చి సర్వే చేసి భూమి హద్దులు చూయించమని బ్రతిమిలాడిన నక్షా లేదని నక్షా ఉంటెనే సర్వే చేయడానికి వస్తుందని తెలిపారు. దీంతో మైనొద్ది న్ హైదరాబాద్‌లోని భూ సర్వే ప్రదాన కార్యాలయానికి వెల్లి నక్షా తెచ్చి పుల్కల్ సర్వేయర్ దేవిసింగ్‌కు అందించాడు. ఐన కనికరించని సర్వేయర్ నీవు ఒక్కని భూమి కొలవడం కాదు చుట్టు ప్రక్కల రైతుల భూమి కూడా సర్వే చేయాలి అందుకు నీవే పక్క రైతులను ఒప్పించాలని తప్పించుకున్నాడు. మైనోద్దిన్ భూమిని చుట్టు పక్కల వారే అక్రమించుకోవడంతో సర్వేకు చుట్టు పక్క ల వారు సహకరించడం లేదు. చుట్టు పక్కల వారికి నోటీసులు జారి చేయాల్సిన బాధ్యత సర్వేయర్‌ది. కాని ఈ విషయాన్ని సర్వేయర్ విస్మరించాడు.

పదేండ్లుగా సాగుచేయడం లేదు..
- మహ్మద్ మైనొద్దిన్ (భూ యజమాని మిన్‌పూర్)
భూమి కొని పదేండ్లు అయిన అక్రమణదారుల చెరలోనే ఉంది. భూమి సర్వే చేయమని పుల్కల్ మండల సర్వేయర్ దేవిసింగ్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేదు. 8గుంటల భూమి సర్వే చేయడమేమిటని వ్యంగంగా మాట్లాడాడు. భూ నక్షా హైదరాబాద్ కార్యాలయంలో ఉందంటే అక్కడికి పోయి తెచ్చిన, ఐనా సర్వే మాత్రం చేయలేదు. పైగా మా పని ప్రతి ఒక్కరికి భూమి చూయించడమేనా అని ప్రశ్నించాడు. ఊర్లో పనులన్ని మా మెడకే చుడుతే ఎలా అని ప్రశ్నించాడు. పదేండ్ల క్రితం కొన్న భూమిలో నేను ఇప్పటి వరకు సాగు చేయలేదు. ఇప్పటి వరకు నా భూమిలో పాదం మోపలేదు. సర్వేయర్ సతాయిస్తుండని తహిసీల్దార్‌కు చెప్పిన పట్టించుకోలేదు.
చిన్న కమతాలను సర్వేచేయలెం
- దేవిసింగ్

(సర్వేయర్ పుల్కల్)
మహ్మద్ మైనొద్దిన్‌ది కేవలం 8గుంట ల భూమి మాత్ర మే. చిన్న కమతాల ను సర్వేచేయలెం తీవ్ర వత్తిడీలు ఉంటే తప్ప సర్వే చేయం. సర్వేనంబర్ మొత్తా న్ని సర్వేచేస్తాం. చిన్న చిన్న కమతాలను సర్వే చేయం.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...