సత్వరమే భూ సమస్యలు పరిష్కరించాలి


Tue,April 23, 2019 11:25 PM

-జిల్లా సంయుక్త కలెక్టర్ నిఖిలారెడ్డి
ఝరాసంగం: రైతులకు సంబంధించిన భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ నిఖిలారెడ్డి రెవెన్యూ సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆమె రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మండలంలో నూతన పాస్ పుస్తకాలు అందని రైతులు ఎంతమంది ఉన్నారని అడుగగా దాదాపు 2 వేల వరకు ఉన్నారని తహసీల్దార్ తెలిపారు. దీంతో ఆమె సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు మీరు విధులు నిర్వహిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో మూడు బృందాలను ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న ఫౌతీలు, ముటేషన్‌లు, పాస్‌పుస్తకాల్లో తప్పు, ఒప్పులు, సర్వే నెంబర్ల తప్పుల్లాంటివన్నీ నేరుగా గ్రామాలకు వెళ్లి రైతులతో సమావేశమై అక్కడే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. వారం రోజుల్లో పెండింగ్ పనులు పూర్తి కానైట్లెతే సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. రైతులు ఎవ్వరినీ కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదన్నారు. సమావేశంలో శిక్షణ ఐఏఎస్ డిటేష్ బి పాటిల్, తహసీల్దార్ అమీన్‌సింగ్, డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్, సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, సర్వేయర్ లాల్‌సింగ్, వివిధ గ్రామాల వీఆర్వోలు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...