నామినేషన్లు... షురూ..


Tue,April 23, 2019 12:17 AM

- మొదటి రోజు 71 నామినేషన్లు దాఖలు
- జడ్పీటీసీ స్థానాలకు 8, ఎంపీటీసీ స్థానాలకు 63 నామినేషన్లు
- 9 మండలాల్లో మొదటి విడుత ఎన్నికలు..
- ఎంపీడీపీవో కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. జిల్లాలో మొదటి విడుతలో 9 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మండలాలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈ విడుతలో 103 ఎంపీటీసీ, 9 జడ్పీటీసీ స్థానాలకు గాను మొదటి రోజు 71 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొదటి విడుతకు సంబంధించి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 60 మంది అభ్యర్థులు 63 సెట్ల నామినేషన్లు వేశారు. ఇందులో టీఆర్‌ఎస్ నుంచి 34, కాంగ్రెస్ 19, బీజేపీ 4 నామినేషన్లు వేశారు. జడ్పీటీసీ స్థానాల నుంచి 8 మంది అభ్యర్థులు 8 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి 3, కాంగ్రెస్ 2, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థులు 2 నామినేషన్లు వేశారు. ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు.

నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. జిల్లాలో మొదటి విడుతలో 9 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మండలాలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈ విడుతలో 103 ఎంపీటీసీ, 9 జడ్పీటీసీ స్థానాలకు గాను మొదటిరోజు 71 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడుతకు సంబంధించి 24వరకు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 60 మంది అభ్యర్థులు 63 సెట్ల నామినేషన్లు వేశారు. ఇందులో టీఆర్‌ఎస్ నుంచి 34, కాంగ్రెస్ 19, బీజేపీ 4 నామినేషన్లు వచ్చారు. జడ్పీటీసీ స్థానాల నుంచి 8 అభ్యర్థులు 8 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి 3, కాంగ్రెస్ 2, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థులు 2 నామినేషన్లు వేశారు. ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ రెండు స్థానాలకు అక్కడే నామినేషన్లు తీసుకుంటున్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు ప్రతిపాదించే వారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. నామినేషన్లను సరిచూడడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాగా, మొదటి రోజు కొంత తక్కువగానే నామినేషన్లు రాగా చివరి రోజు ఎక్కువ నామినేషన్లు రానున్నట్లు తెలుస్తోంది.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...