గ్రీవెన్స్‌లో ఫిర్యాదుల వెల్లువ


Tue,April 23, 2019 12:14 AM

సంగారెడ్డి టౌన్: తన భూమిని వారి పేరుపై రాసి ఇవ్వాలని తన కొడుకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఝరాసంఘం మండలానికి చెందిన ఓ ఫిర్యాదుదారుడు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సోమవారం నిర్వహించిన పోలీసు ప్రజా విజ్ఞప్తుల దినంలో జిల్లా నలుమూలల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. అవి ఇలా ఉన్నాయి.

- తనకు ఝరాసంగం మండలంలో 6 ఎకరాల భూమి ఉన్నదని, ఆ భూమిలో తన కుమారులు ముగ్గురు పంటలు పండించుకుంటున్నారని, కొన్ని సంవత్సరాలుగా ఆ భూమిని వారి పేరున రాసి ఇవ్వమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన ముగ్గురు కుమారులు ఎవ్వరూ కూడా తన బాబోగులు చూడడం లేదని, తానే కూలీ పని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆస్తి వారి పేరుపై రాసివ్వనందుకు తనను కొట్టారని, ప్రస్తుతం తనకు ప్రాణహాణి ఉన్నదని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని ఝరాసంగం మండలానికి చెందిన ఓ ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేశారు.
-
తమ ఇంటిలో అద్దెకు ఉండే వ్యక్తికి ఇల్లు ఖాళీ చేయమని సంవత్సర కాలంగా చేస్తునే ఉన్నా కూడా ఆ వ్యక్తి తమ ఇల్లు ఖాళీ చేయకపోగా, అద్దె రుసుము కూడా సకాలంలో చెల్లించడం లేదని, ఆ వ్యక్తిని ఇల్లు ఖాళీ చేయించి తనకు న్యాయం చేయాలని సదాశివపేటకు చెందిన ఒక ఫిర్యాదురాలు ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.

- భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన తన భర్త పేరుపై తాపీ మేస్త్రీ అసోసియేషన్ పాలసీ తరపున రూ.6 లక్షల 20 వేలు వచ్చాయని, ఆ డబ్బులను తన అత్తగారి కుటుంబ సభ్యులు తప్పుడు ఫిర్యాదులు చేసి తీసుకుని తనను ఇంటి నుంచి గెంటివేశారన్నారు. తన పిల్లలను పోషించాలంటే ఆ డబ్బు తనకు అవసరం కావున తనకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని రాయికోడ్ మండలానికి చెందిన ఒక ఫిర్యాదురాలు వినతిపత్రం అందజేశారు.

- డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న తన కూతురు ఈనెల 3వ తేదీ నుంచి కనబడకుండా పోయిందని, తన కూతురి ఆచూకీ కనుగొని తమకు అప్పగించాలని పటాన్‌చెరు మండలానికి చెందిన ఒక ఫిర్యాదుదారుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ వాటిని పరిష్కరించాలని సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులను ఆదేశించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...