వేసవి భత్యం..


Tue,April 23, 2019 12:13 AM

రాయికోడ్ : గ్రామీణ ఉపాధిహామి పథకంలో పనిచేసే కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి. వేసవిలో పనికి అదనపు భత్యం చెల్లించాలని నిర్ణయించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1-నుంచి జూన్ 30వరకు ఈ అదనపు కూలి చెల్లించనున్నారు. ఫిబ్రవరి నెలలో 20శాతం అదనంగా అందనుంది, అదేవిధంగా ఎండల దృష్ట్యా ఒక్కో కూలీకి ఐదు లీటర్ల తాగునీటికి రూ. 25రూపాయిలు ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో మండలంలో 35గ్రామల్లో 6418మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది. కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో మండలంలో 2లక్షల 77వేల పనిదినాలు కల్పించాలని గ్రామీణ ఉపాధిహామి శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణ, పని కల్పించాలనే ఉద్ధేశంతో తీసుకొచ్చిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేసే కూలీలను వేసవిలో ఆదనపు వేతనం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభూత్వాలు నిర్ణయించాయి. మండుతున్న ఎం డల దృష్ట్యా ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకు ఈ భత్యాన్ని అందిస్తారు. దీనికి తోడు ఒక్కో కూలీకి రోజుకు లీటర్‌కు రూ.5 చొప్పున ఐదు లీటర్ల తాగునీటికి రూ.25 రూపాయలు అందజేస్తారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుం చి 6గంటల వరకు కూలీలతో పనిచేస్తున్నారు. ప్రభు త్వా నిర్ణయంతో మండలంలోని 35 గ్రామాల్లో ఉపాధి హామీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి కూలీలకు ఊరట
వలసలు నివారించి ఉన్న ఊళ్లో పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2005లో ఉపాధిహామి పథకాన్ని ప్రారంభించింది. ఎవరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉన్న ఊళ్లోనే ఉపాధి పొందాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద గ్రామాల్లో అనేక రకాలు పనులు కల్పిస్తున్నారు. కాగా,మిగతా సమయంతో పోలిస్తే ఎండకాలంలో భూమి గట్టిగా ఉండడం వల్ల కూలీలు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. వేసవిలో మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని అదనపు భత్యం అందజేయాలని ప్రభుత్వం అదనపు భత్వం ప్రకటించడంతో ఉపాధి కూలీలను ఊరట లభించింది.

మండలంలో 6418 కూలీలకు లబ్ధి...
మండల వ్యాప్తంగా 35గ్రామాల్లో 3877 ఉఫాధి హామీ జాబ్ కార్డులు ఉండగా, వీటి పరిధిలో మొత్తం 6418మంది కూలీలున్నా రు. కరువు, వేసవి కాలంలో ఎక్కడా పని దొ రకని సమయంలో ఈ పథకం ద్వారా ఉపాధి లభిస్తున్నది. వీరికి ప్రస్తుతం రోజుకు రూ.150 నుంచి రూ. 200వరకు వేతనం అందుతున్నది. వేసవిలో అదనపు భత్యం అందించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న కూలికి అదనంగా రూ. 20నుంచి రూ. 30వరకు అందనుంది. ఫిబ్రవరి నెలలో 20శాతం, మార్చిలో 25, ఏప్రిల్, మే నెలలో30 శాతం, జూన్‌లో 20శాతం అదనపు కూలీ అందనుంది. ప్రస్తుతం చెల్లిస్తున్న కూలీకి అదనంగా పెరిగిన వేతనం కలుపుకుంటే కూలీలకు రూ. 250 వకరు అందే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో మండలంలో 2లక్షల 77వేల పనిదినాలు కల్పించాలని గ్రామీణ ఉపాధిహామీ మండల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు పకడ్బందీగా అమ లు చేయాడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.

అదనపు భత్యం ఇవ్వడం సంతోషకరం
మండుతున్న ఎండల్లో ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు పైసలు పెంచడం సంతోషకరం. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 6నుంచి 10వరకు సాయంత్రం 4నుంచి 6వరకు కూలీ పనులకు వెళ్తు న్నాం. మా కష్టం గుర్తించిన ప్రభుత్వం అదనపు డబ్బు లు అందించడం మంచి నిర్ణయం. చేసిన పనికి పడే కూలితో పాటు 20నుంచి 30శాతం ఎక్కువగా ఇవ్వడం ఆనందంగా ఉంది.
- ప్రదీఫ్ ఉపాధిహామీ కూలీ గ్రామం కుస్నూర్

పనికి తగిన కూలి ఇస్తుండ్రు
ఎండకాలంలో భూమి గట్టిగా ఉండడంతో ఎక్కువ పనిచేయడం లేదు. దీంతో కూలి తక్కువగా పడుతుం ది. వేసవికాలంలో ప్రభు త్వం అదనపు భత్యం అందిస్తుండడంతో మాకు గిట్టుబాటు అవుతుంది. అన్నీ కలిపి రోజుకు 205నుంచి 211వరకు వస్తుంది. ఉపాధిహామీ కూలీలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.
- భాగమ్మ కూలీ గ్రామం కుస్నూర్

కూలీలు సద్వినియోగం చేసుకోవాలి
వలసలు నివారణకు ఏ ఊరి ప్రజలకు అక్కడే పను లు కల్పించేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాబ్‌కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ ప నులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పనికి తగిన వేతనం అందించేందుకు కృషి చేస్తున్నాం. ఎండకాలంలో వ్యవసాయ పనులు తక్కువగా ఉంటా యి కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వేసవిలో ప్రభుత్వం అందిస్తున్న అదనపు భత్యం ఉపాధిహామీ కూలీలకు ఎంతో మేలు జరుగుతుంది. వేసవిలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వేసవి భత్యం 20 నుంచి 30 శాతం వరకు చెల్లించనుంది.
- ఎంపీడీవో స్టీవేన్‌నీల్

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...