రైతులు అభివృద్ధి చెందాలి జిల్లా నాబార్డు డీడీఎం తిమోతి


Tue,April 23, 2019 12:13 AM

కోహీర్ : భూగర్భజలాలు పెంపొంది రైతులందరూ అభివృద్ధి చెందాలని జిల్లా నాబార్డు డిప్యూ టీ మేనేజర్ సి.తిమోతి కోరారు. సోమవారం మండలంలోని బిలాల్‌పూర్ గ్రామంలో నాబార్డు ఆధ్వర్యంలో చేపట్టిన వాతావరణ నిర్ధారణ ప్రాజెక్టును డీడీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పొలాల వద్ద వర్షపు నీరు వృథా పోకుండా రాతి కట్టలను నిర్మించాలని సూచించారు. నాబార్డు ఆధ్వర్యంలో రైతుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. పొలాల వద్ద బోరుబావుల తవ్వకంతో పాటు చెక్ డ్యామ్ నిర్మాణం, నీటి కుంటలను తయారు చేస్తున్నామని వివరించారు. గ్రామంలో రూ. 1.50లక్షలతో వాతావరణ ప్రూ పింగ్ ప్రాజెక్టు కార్యాలయాన్ని ప్రారంభించామని వెల్లడించారు. వ్యవసాయంలో సాగునీటి కోసం రైతులు వినియోగించేందుకు రేయిన్ గన్, డ్రిప్పు, స్ప్రింక్లర్లు, తదితర పరికరాలను మంజూరు చేయిస్తామన్నారు. సమావేశంలో సర్పంచ్ నర్సింహు లు, ఎంపీటీసీ రాజు, బ్యాంకు మేనేజర్ వినయ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ నర్సింహులు, శ్రీనివాస్, రత్నం, అశోక్, రైతులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...