నేటి నుంచి నామినేషన్లు


Sun,April 21, 2019 11:44 PM

-జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ షురూ
-మొదటి విడుతలో 9 మండలాల్లో...
-9 జడ్పీటీసీ, 103 ఎంపీటీసీ స్థానాలు
-మండల కేంద్రాల్లోనే నామినేషన్ల స్వీకరణ
-ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు...
సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లాలో మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జిల్లాలో 25 మండలాల్లో 25 జడ్పీటీసీ, 295 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కాగా, మొదటి విడుతలో 9 మండలాల్లో 103 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 24వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఆయా మండల కేంద్రాల్లోనే ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 7,77,183 మంది ఓటర్లు ఉండగా మొదటి విడుతలో 103 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 2,71,220 మంది ఓటు హక్కు నియోగించుకోనున్నారు.

ఎన్నికల కోసం మొత్తం 1648 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. మొదటి విడుత కోసం 581 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా 192 లొకేషన్లను గుర్తించారు. ఈ విడుతలో సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర మండలాలున్నాయి. కాగా, మొదటి విడుతకు సంబంధించిన నేటి నుంచి 24 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 25న నామినేషన్ల పరిశీలన, 28న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. వచ్చే నెల మే 6న పోలింగ్ నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు నమస్తే తెలంగాణ ప్రతినిధితో వెల్లడించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...