ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు


Sun,April 21, 2019 11:19 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తేతెలంగాణ: మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం పట్టణంలోని నటరాజ్ థియేటర్ ఎదుట టీఆర్‌ఎస్ పట్టణ కమిటీ ఏర్పాటు చేసిన వేడుకలలో మాజీ ఎమ్మెల్యే కేక్‌కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అంతకుముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు డోలు వాయిస్తూ, పెద్దత్తున పటాకులు పేల్చడంతో రహదారిపై సందడి వాతవరణం నెలకున్నది. అభిమానుల కోరికమేరకు చింతా ప్రభాకర్ డోలు వాయించి కార్యకర్తలను ఆకట్టుకున్నారు. అభిమానులు ప్రత్యేకంగా తయారు చేసిన పుదీనా గజమాల, పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కంది శివారులోని గెట్‌వేలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరై కేక్‌కట్ చేసి ప్రభాకర్‌కు తినిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ కార్యకర్తలు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తన ప్రత్యేకతను చాటుకున్న ప్రభాకర్ పుట్టిన రోజు వేడుకలకు తాను రావడం సంతోషకరమన్నారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో తన గెలుపునకు కార్యకర్తలను సైనికుల్లా పనిచేసి గెలిపించాలని కృషిచేశాడని గుర్తుచేశారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ సాధించడానికి మాజీ ఎమ్మెల్యే కృషి మరువలేమన్నారు. అలాంటి రాజకీయ విలువలు కలిగిన నాయకుడు పదికాలాల పాటు ఆయురారోగ్యం, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కార్యకర్తలే తన బలమని, ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు.

కార్యకర్తలు, నాయకులు చూపిస్తున్న అభిమానం జీవితంలో మర్చిపోలేనని, తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసే కార్యకర్తలు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాని పేర్కొన్నారు. ఈ వేడుకలలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ శంకరి విజయేందర్‌రెడ్డి, జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, కొండాపూర్ ఎంపీపీ మ్యాకం విఠల్, ఆత్మ కమిటీ చైర్మన్ పుర్ర నారాయణ యాదవ్, కౌన్సిలర్లు ప్రదీప్ యాదవ్, వెంకటేశం, టీఆర్‌ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రభాకర్, ఆశోక్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, నాయకులు డాక్టర్ శ్రీహరి, రాజుగౌడ్, నాగరాజుగౌడ్, ప్రభుగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రశీద్, రాంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నందకిశోర్, ప్రవీణ్, గోవిందబాబా చారి, శ్రావణ్‌రెడ్డి, కొత్తపల్లి నానీ, వాజీద్, అజీబ్, మోహన్, వాజీద్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.

చింతా ప్రభాకర్‌కు బీబీపాటిల్ శుభాకాంక్షలు...
మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను మాజీ ఎంపీ బీబీపాటిల్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం స్థానిక బైపాస్ రోడ్‌లోని ఎంఎం ఫంక్షన్‌హాల్‌లో ప్రభాకర్‌ను కలిసి పుట్టినరోజు సందర్భంగా పూలమాలలు వేసి కేక్ కట్ చేయించి ఘనంగా సన్మానించారు. పదికాలాల పాటు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

సదాశివపేటలో...
సదాశివపేటలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు శనివారం అర్ధరాత్రి 12 గంటల తరువాత చింతా ప్రభాకర్‌ను కలిసి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉదయాన్నే సదాశివపేటకు తరలివెళ్లి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యేకు కేక్‌ను తినిపించి సంబురాలు చేశారు. పదికాలాల పాటు సుఖసంతోషాలతో ఉండాలని అభిమానులు ఆకాక్షించారు. వేడుకలలో టీఆర్‌ఎస్ సంగారెడ్డి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.వెంకటేశ్వర్లు, పెరుమాండ్ల నర్సింహులు, కౌన్సిలర్ చిల్వరి మురళి, సర్పంచ్ మోహన్ నాయక్, టీఆర్‌ఎస్ కొండాపూర్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, పట్టణ మైనార్టీ అధ్యక్షులు ముజీబ్, నాయకులు అమీరుద్దీన్, శకీల్ హమ్మద్, మజీద్, హరికిషన్, సందీప్‌రెడ్డి, పరుశురామ్ నాయక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

రోగులకు పండ్లు పంపిణీ...
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడు మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చీల మల్లన్న ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఈశ్వర్, పాషా, చేకూరి రవి, విశ్వేశ్వర్, మల్లయ్యస్వామి, కమ్మరి బ్రహ్మయ్య, రైతు సమన్వయ సభ్యులున్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...