తాలెల్మను పూర్తిచేయాలి


Sun,April 21, 2019 11:18 PM

-రూ.36.74 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులు...
-భూములన్నీ సస్యశ్యామలం చేయడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం
-పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
అందోల్, నమస్తే తెలంగాణ : బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులను నింపేందుకు శ్రీ కారం చుట్టిందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. అందోల్ మండల పరిధిలోని తాలెల్మ గట్టు వద్ద రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం పనులను ఆదివారం ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పరిశీలించారు. సింగూర్ బ్యాక్ వాటర్ నుంచి తాలెల్మ వరకు ఏర్పాటు చేయనున్న పైపులైన్ పనుల వివరాలను లిఫ్ట్ ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే పంటకాలంలోపు తాలెల్మ ఎత్తిపోతల పనులను పూర్తి చేయాలని, దేవునూర్, టేక్మాల్, రాయికోడ్, మునిపల్లి, రేగోడు మండలాల్లో ఎత్తిపోతల పథకం పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎత్తిపోతల ద్వారా పైపులైన్‌లను ఏర్పాటు చేసి చెరువులను నింపి, మారుమూల గ్రామాల్లోని భూములను సా గులోకి తీసుకురావడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి పెద్దపీట వేసిందని, సాగుకు నీటిని అందించడమే లక్ష్యంగా వేలాది కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రాజెక్టు, ఎత్తిపోతల పనులను చేపడుతుందన్నారు.

తాలెల్మ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా సింగూర్ బ్యాక్ వాటర్‌ను 0.117 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులను ఇచ్చిందన్నారు. ఎత్తిపోతల పథకం పనులకు గాను రూ.36.74 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ పనులు పూర్తయితే నియోజకవర్గంలోని అం దోల్, అల్లాదుర్గం, వట్‌పల్లి, టేక్మాల్ మండలాల పరిధిలోని 14 గ్రామాల్లోని 40 చెరువుల్లోకి పుష్కలంగా నీరు వచ్చి చేరుతుందని, దీంతో ఆయా చెరువుల కిందనున్న ఆయకట్టు 3 వేల ఎకరాలకు పైగా భూములు సాగులోకి వస్తాయన్నారు. పనుల్లో వేగం పెంచాలని, రెండు నెలల్లోగా పూర్తి చేసేలా చూడాలని, ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం రైతులతో కలిసి మాట్లాడారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులకు రైతులు సహకరించాలన్నారు. పనులు పూర్తయితే సాగు నీటికి ఢోకా ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆయనతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ శ్రీనాథ్, ఏఈ విజయ్ సాగర్, సర్పంచ్ లింగాగౌడ్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, నాయకులు విజయ్‌కుమార్, నాగరాజ్, కృష్ణాగౌడ్ తదితరులు ఉన్నారు.

కెనాల్ పనుల పరిశీలన...
వట్‌పల్లి : తాలెల్మ ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న ఎత్తిపోతల పనులను ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆదివారం పరిశీలించారు. మండలంలోని సాయిపేటలో నిర్మిస్తున్న కెనాల్‌ను పరిశీలించి, దాని వివరాల ను అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సాఫీగా పంటల ను సాగుచేసుకోవాలనే లక్ష్యంతో పైపుల ద్వారా సాగునీటిని అందిస్తామన్నారు. నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరందించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...