అమరుల త్యాగం మరువలేనిది


Sun,April 21, 2019 11:16 PM

-ఎమ్మెల్యే క్రాంతికిరణ్
-అమర వీరుల కుటుంబాల వేదికక్యాలెండర్ ఆవిష్కరణ
అందోల్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమర వీరుల త్యాగాలను ఎన్నటికీ మరిచిపోలేవని అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. ఆదివారం అందోలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అమరవీరుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని మర్యాదపూర్వకంగా శాలువాలను కప్పి సత్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక క్యాలెండర్‌ను వారితో కలిసి ఆయన ఆవిష్కరించారు. వారితో కొద్దిసేపు ముచ్చటించి, వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని, వారి త్యాగం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ఉంటుందన్నారు. అమరవీరుల ప్రాణ త్యాగం, కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంతోనే ప్రత్యేక రాష్ట్ర సాధన సాధ్యమైందన్నారు.

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమర వీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారికి బాసటగా నిలువాలన్న ఉద్దేశతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం, రూ.10 లక్షల నగదును అందజేసి, కుటుంబాలకు చెదోడు వాదోడుగా అండగా నిలిచిందన్నారు. రాబోవు రోజుల్లోనూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ను అమరవీరుల కుటుంబ సభ్యులు శాలువాను కప్పి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జోగిపేటకు చెందిన అమరవీరులు కాశరాజు భార్య నాగలక్ష్మి, కూతుర్లు సంకీర్తన, సుచిత, కొనపాటి రవీందర్ తల్లి భూలక్ష్మి, అన్నయ్య అనిల్, అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌కు చెందిన అమరవీరుడు యాదగిరి తల్లి రత్నమ్మ, అన్నయ్య రమేశ్, టేక్మాల్ మండలం కాదులూర్ తాండాకు చెందిన అమరవీరుడు సురేశ్ నాయక్ తల్లి సిమ్నీబాయి, అన్నయ్య నారాయణలతో పాటు జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, నాయకులు అనీల్‌రాజ్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...