ఘనంగా ఈస్టర్


Sun,April 21, 2019 11:16 PM

ఝరాసంగం : మండల కేంద్రమైన ఝరాసంగంతో పాటు మాచ్నూర్, బోరెగావ్, కుప్పానగర్ బర్దీపూర్, కృష్ణాపూర్, బిడెకన్నె, ఏడాకులపల్లి, పోట్‌పల్లి తదితర గ్రామాల్లో ఆదివారం ఈస్టర్‌ను ఘనంగా జరుపుకొన్నారు. ఝరాసంగంలోని ఈస్టర్ గుట్ట వద్ద ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకు ముందు అగాపే సంఘం సభ్యులు ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. పలువురు గ్రామ పాస్టర్లు మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు 40 రోజుల ఉపవాస దీక్షలు చేసి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు విరమిస్తారన్నారు. కార్యక్రమంలో ఝరాసంగం గ్రామ సర్పంచ్ జగదీశ్వర్, పాస్టర్లు రాజేందర్, ప్రశాంత్, సుందర్ రాజ్, ఆయా గ్రామల పెద్దలు సంగ్రామ్, ఆనంద్ కుమార్ అమృత్, నర్సింహులు, నాగేశ్, చిరంజీవి, బిచ్చప్ప, సంగప్ప, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కోహీర్‌లో...
కోహీర్ : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని క్రైస్తవులు ఏసుక్రీస్తు పునరుత్తనాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామ శివారులోని ఈస్టర్ గుట్ట వ ద్ద సామూహిక ప్రార్థనలు గావించారు. ఈ సందర్భంగా పా స్ట ర్లు బైబల్‌లోని విశేషాలను చెప్పారు. శుక్రవారం శిలువకు వే యబడిన ఏసుక్రీస్తు ఆదివారం పు నరుజ్జీవుడయ్యాడని భక్తులకు వివరించారు. అనంతరం భక్తుల కు అ న్నదానం చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
న్యాల్‌కల్‌లో...
న్యాల్‌కల్ : మండలంలోని క్రైస్తవులు ఈస్టర్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హద్నూర్, న్యాల్‌కల్, మామిడ్గి, రేజింతల్, మెటల్‌కుంట,చాల్కి, ముంగి, గుంజోట్టి, మిర్జాపూర్(బి), వడ్డీ, రత్నాపూర్, కాకిజనవాడ, హుస్సేనగర్, గంగ్వార్, న్యామతాబాద్ తదితర గ్రామాల్లోని భాజ భజంత్రీల హోరు, భజన కీర్తనాల మధ్య క్రైస్తవులు ఉదయం ఈస్టర్ గుట్టల వద్దకు చేరుకుని భజన కీర్తనలను ఆలపించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...