అభ్యర్థుల ఎంపికకు పార్టీల కసరత్తు


Sun,April 21, 2019 11:16 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : జడ్పీటీసీ, ఎంపీటీసీ పోరు జోరందుకుంటోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగనుండటంతో అన్ని పార్టీలు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు జడ్పీటీసీ, ఎంపీపీ పీటమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం ప్రజల్లో ఎవరికి మంచి పేరు ఉంది.. టికెట్ కేటాయిస్తే గెలుస్తాడా లేదా అని బేరీజు వేస్తున్నారు. గ్రామాల్లో మంచి పలుకుబడి కలిగి ఉండి, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించిన వారికి, సర్పంచ్ ఎన్నికల్లో సైతం తమ వంతు ముద్రవేసి పార్టీని ముందుండి నడిపించిన వారికి టికెట్లు ఇవ్వాలని నాయకులు యోచిస్తున్నారని వినికిడి. దీని కోసం జహీరాబాద్ నియోజవర్గంలోని జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, కోహీర్, ఝరాసంగం మండలంలోని కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నారని సమాచారం. టికెట్ ఎవరికొచ్చిన పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పని చేయాలని కార్యకర్తలకు వారు సూచిస్తున్నారు. పార్టీ గుర్తులతో జరిగే పోటీలు కనుక ఎన్నికల రంగంలో ఉండాలని ఆశావహులు బీ ఫారం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీలో జడ్పీటీసీ, ఎంపీటీసీల అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యే, ముఖ్య నాయకులకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అప్పగించడంతో టికెట్ కోసం వారి చుట్టూ చక్కర్లు కొడుతుండగా, ప్రతిపక్ష పార్టీలో అభ్యర్థుల కోసం నాయకులు వెతుకులాడుతున్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...