భక్తి శ్రద్ధలతో ఈస్టర్


Sun,April 21, 2019 11:16 PM

రాయికోడ్: క్రైస్తవులు మండలంలోని వివిధ గ్రామాలల్లో ఈస్టర్ పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఆదివారం మండల కేంద్రం రాయికోడ్‌లో ఈస్టర్ గుట్టలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాస్టర్ జీవరత్నం తమ దైవ సందేశానిస్తూ ఏసు ప్రభువు తనను శిక్షిస్తున్న వారిని కూడా క్షమించమని తండ్రి అయిన దేవుడిని ప్రార్థించాడని చెప్పారు. భగవంతుడు ప్రణాళిక ప్రకారం చనిపోయిన మూడో రోజు సమాధి నుంచి సజీవంగా లేచాడని, ఏసు శిలువపై మరణించిన రోజున ప్రపంచ వ్యాప్తంగా కైస్తవులు గుడ్‌ప్రైడేగా,ఆయన మళ్లీ బతికిన రోజున ఈస్టర్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసయ్య, క్రైస్తవ సంఘం సభ్యులు శామ్‌సన్, దేవాదనం,శివకుమార్, ఈరప్ప, జయరాజు, భుమయ్య, సునీల్, బాల్‌రాజ్ ఉన్నారు.

మునిపల్లిలో..
మునిపల్లి: మండలంలోని క్రైస్తవులు ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం మండల కేంద్రం మునిపల్లితో పాటు మండలంలోని గ్రామాల్లో ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించారు. క్రైస్తవులు ఉదయాన్నే ఆయా గ్రామాల శివారులోని ఈస్టర్ గుట్ట దగ్గరకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు బైబిల్ చదివి క్రైస్తవులకు ఏసుక్రీస్తు గురించి వినిపించారు. గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ఈస్టర్ పండుగ సందర్భంగా ఒకరికి ఒకరు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు గ్రామాల్లో చర్చిల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చర్చిల వద్ద చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...