జోరుగా కాల్వల ఆధునికీకరణ పనులు


Sat,April 20, 2019 11:40 PM

రాయికోడ్: వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం మిషన్‌కాకతీయ పనులు చేసి చెరువులను పునరుద్ధరణ చేసేందుకు భారీగా నిధులు మంజూరు చేసిందని మండల ఇరిగేషన్ ఏఈ జానకీరామ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని కుస్నూర్ శివారులో గుర్మిల్లావాగు ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుర్మిల్లావాగు ప్రాజెక్టు కుడి, ఎడుమ కాల్వల మరమ్మతుల కోసం ప్రభుత్వం మిషన్ కాకతీయ 3వ విడుతలో రూ.2.41 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కాల్వలను శుభ్రం చేయడంతో పూడిక మట్టిని, కాల్వ వెంటనున్న కంప చెట్లను తొలిగించి ప్రాజెక్టు కట్టను ఎత్తు పెంచే పనులు చేపట్టామని చెప్పారు. కుడి, ఎడమ కాల్వలు కలిపి సుమారు 32 కిలో మీటర్ల మేర పనులు చేపట్టి చివరి భూములు వరకు సాగు నీరందేలా చేస్తామన్నారు. దీనికి సంబంధించిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ పనులు పూర్తియితే అదనంగా మరో రెండు వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందన్నారు. పనులు నాణ్యవంతంగా చేయాలని కాంట్రాక్ట్‌ను సూచించాని స్పష్టం చేశారు. ప్రాజెక్టు 60 శాతం పనులు చేశామన్నారు. వాతావరణం అనుకూలిస్తే 60 రోజులలో ప్రాజెక్టు పనులు 100 శాతం పూర్తి చేస్తామన్నారు. ఈయన వెంట సిబ్బంది నవాజ్, కాంట్రాక్టర్ రమేశ్ ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...