జై శ్రీరామ్


Fri,April 19, 2019 11:32 PM

- వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్ : జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా పలుచోట్ల నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో హనుమాన్ ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దారులన్నీ జై శ్రీరామ్.. నినాదాలతో మార్మోగాయి.

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ: హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి హనుమాన్ భక్తులు ఊరేగింపునకు తరలివచ్చారు. శుక్రవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక భవానీమాత ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభించారు. జైశ్రీరామ్, జైభారత్‌మాతా నినాదాలతో రహదారులన్నీ మార్మోగాయి. అంతకుముందు నవరత్నాలయంలో హనుమంతుడిని పురోహితులు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. గ్రామాల్లో శుభకార్యాలు, వివాహాలు జరిగితే ముందుగా హ నుమంతుడి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. అలాంటి ఉత్సవమూర్తి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి భక్తులు భారీ బైక్‌ర్యాలీలు నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని కింది బజారు భవానీమాత ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పాతబస్టాండ్ మీదుగా కొత్త బస్టాండ్, ప్రధాన రహదారి గుండా పోతిరెడ్డిపల్లి నుంచి విద్యానగర్‌కాలనీ, ఏపీహెచ్‌పీ కాలనీ సీతారామంజనేయ హరిహర క్షేత్రం మీదుగా బైపాస్ రోడ్, ప్రభుత్వ అతిథిగృహం నుంచి బస్టాండ్ల గుండా వైకుంఠపురం వరకు కొనసాగింది. అలాగే సదాశివపేటలోని హనుమాన్‌నగర్‌లోని హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పోలీస్‌స్టేషన్ మీదుగా బస్టాండు, శాస్త్రిరోడ్, గాంధీరోడ్, రాంమందిర్, తిలక్‌రోడ్ నుంచి తిరిగి హనుమాన్ ఆలయం వరకు యాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హనుమంతుడి దర్శనం చేసుకుని ఈ యాత్రలో పాల్గొని హనుమాన్ భక్తులతో కలిసి భజన కార్యక్రమం, అన్నదానం చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, నాయకులు కొవూరి సంగమేశ్వర్, మాణిక్‌రావు, శ్రీశైలం యాద వ్, సత్యనారాయణ, కొత్తపల్లి నానీ, యశ్వంత్, పవన్, శ్రీకాంత్, వైకుంఠాపురం ప్రధానార్చకులు వరదాచార్యులున్నారు.

ఘనంగా హనుమాన్ జయంతి...
సంగారెడ్డి రూరల్: నిత్యం శ్రీరామ నామం చేసే రాముని ప్రియ భక్తుడైన హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం సంగారెడ్డి, కంది మండలాల్లో కంది, కాశీపూర్, కలివేముల, ఇంద్రకరణ్, ఎద్దుమైలారం, ఫసల్‌వాదీ, కలబ్‌గూర్, పోతిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో హనుమాన్ దేవాలయాల్లో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం హనుమాన్ దేవాలయాల్లో పూజారులు ప్రత్యేజ పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. జైశ్రీరాం, జైహనుమాన్ నినాదాలతో గ్రామ పురవీధులు మార్మోగాయి. కాషాయపు జెండాలను ఎగురవేస్తూ యువకులు బైక్‌ర్యాలీని నిర్వహించారు. వేడుకల్లో ఆయాగ్రామాల సర్పంచ్, ఉపసర్పంచ్‌లతో పాటు యువకులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ఇందిరాకాలనీలో...
సంగారెడ్డి టౌన్: హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరాకాలనీలో శుక్రవారం అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఉమామహేశ్వర ఆలయం పంచమ వార్షికోత్సవ సందర్భంగా శివ పార్వతులు కల్యాణ, హోమం, పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...